రాకేష్ మాస్టర్ జీవితం లోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు...

ఇండస్ట్రీ లో చాలా మంది కొరియోగ్రాఫర్ లు( Tollywood Choreograhers ) ఉన్న కూడా అందులో రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ సెపరేట్ అనే చెప్పాలి.ఆయన మంచి కొరియోగ్రాఫర్ అయినప్పటికీ ఇండస్ట్రీ లో ఆయనకి రావాల్సిన గుర్తింపు రాలేదు అనే చెప్పాలి ఇక రీసెంట్ గా రాకేష్ మాస్టర్ ఆకస్మిక మరణం( Rakesh Master Death ) టాలీవుడ్ వర్గాల్లో విషాదం నింపింది…ఇదే సమయంలో అయన జీవితం గురించి పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది .

 Interesting Facts About Choreographer Rakesh Master,rakesh Master, Choreographer-TeluguStop.com

సుమారు 20 ఏళ్లపాటు కోరి యోగ్రాఫర్ గా కొనసాగి చివరకి విషాదాంతం అయిన అయన కెరీర్ గురించి ఇప్పటికి చర్చలు సాగుతూనే ఉన్నాయి .

Telugu Choreographer, Rakesh Master, Rakeshmaster, Tollywood-Movie

సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి .జీవితంలో ఆయన ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం అని చెప్పవచ్చు .అయితే , మరణానికి ముందు గత కొంతకాలం ఆయన మాట్లాడిన తీరు వివాదాస్పదంగా మారింది.సినీ పరిశ్రమలో బిజీగా ఉన్న రోజుల్లో రాకేష్ మాస్టర్( Rakesh Master Properties ) పెద్ద ఇంట్లో ఉండేవారు.ఆయనకు నాలుగైదు కార్లు ఉండేవి.

 Interesting Facts About Choreographer Rakesh Master,Rakesh Master, Choreographer-TeluguStop.com

చేతి నిండా డబ్బు ఉండేది .అంతేకాదు ఎవరేది అడిగినా కాదనేవారు కాదని అయన గురించి తెలిసినవారు చెబుతారు .అయితే ఆయనకు దయాగుణంతో పాటు ముక్కుసూటి తనము ఎక్కువే … ఒక రకంగా ఆయన్ని ఎలా పడితే అలా ఇంటర్వ్యూలు చేసిన కొందరు .వ్యక్తిగతంగా ఆయనకి తీరని నష్టాన్ని మిగిల్చారు.ఆయా ఇంటర్వ్యూలలో పలువురి పేర్లు ప్రస్తావించారు…

Telugu Choreographer, Rakesh Master, Rakeshmaster, Tollywood-Movie

దీనితో వారంతా ఆయనకి దూరం అయ్యారు .అందుకే రాకేష్ మాస్టర్ కొడుకు కూడా ఇకనైనా మమ్మల్ని వదిలేయండి అని వేడుకుంటున్నాడు .రాకేష్ మాస్టర్ శిష్యులు ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్నారు .అయితే తమ గురువు.బహిరంగంగా తమ విలువను తీసేలామాట్లాడడం చూసి ప్రస్తుతం పరిశ్రమలో ఉన్నత స్థితిలో ఉన్న శిష్యులు కూడా మనస్తాపం చెంది దూరమయ్యారు.దీనికి తోడు రాకేష్ మాస్టర్ .మాట్లాడిన మాటలకి వివరణ కోరుతూ .వారి వెంట పడటంతో వారు మరింత ఇబ్బందికర పరిస్థితిలో పడ్డారు .ఒక రకంగా అయన ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోల కారణంగానే ఆయన మరణం, చివరకు అయన పార్థివ దేహం సరైన గుర్తింపును పొందలేకపోయాయి .ఆయన చేతులు పట్టుకొని స్టెప్పు నేర్చుకొన్న హీరోలెవ్వరూ ఆయనకు నివాళులు అర్పించడానికి రాలేదు .

Telugu Choreographer, Rakesh Master, Rakeshmaster, Tollywood-Movie

ఆయనను చివరిసారి చూసేందుకు కూడా రాలేదు.కేవలం కుటుంబ సభ్యులతో( Rakesh Master Family Members ) పాటు కొంత మంది శిష్యులు తోడుగా ఆయన అంతిమయాత్ర సాగింది.రాకేష్ మాస్టర్‌ కళను తప్ప ఎవరిని లెక్క చేయారు .తన టాలెంట్‌పై పూర్తి నమ్మకమున్న ఆయన .సంపదనంతా అడిగిన వాళ్ళకిచ్చి అందులోనే ఆనందాన్ని చూశారు.కరోనా సమయంలో వందలాది మందికి భోజనాలు ఏర్పాటు చేశారు.

ముక్కుసూటిగ మాట్లాడే నైజానికి మద్యం తోడైతే పరిణామాలు ఎలా ఉంటాయో రాకేష్ మాస్టర్ జీవితం ఉదాహరణ అంటారు .మనిషిని ఎంతో ప్రేమించే రాకేష్ మాస్టర్ ఈ లోకం తీరు కుదరకే ఆలా నిష్క్రమించారనే వారు లేకపోలేదు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube