యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Young Rebel Star Prabhas ) హీరోగా రూపొందిన ఆదిపురుష్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా కూడా పాజిటివ్ కలెక్షన్స్ నమోదు అవుతున్న విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో సలార్ సినిమా గురించి అభిమానులతో పాటు ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా ను రూపొందించాడు.
బాహుబలి 2 సినిమా( Baahubali 2 ) తర్వాత ప్రభాస్ ఇప్పటి వరకు మరో సినిమా తో సక్సెస్ ను దక్కించుకోలేక పోయాడు.సాహో.రాధేశ్యామ్ ఇప్పుడు ఆదిపురుష్ సినిమాలు నిరాశ పర్చాయి.అయినా కూడా ప్రభాస్ యొక్క సలార్ సినిమా కు విపరీతమైన బజ్ ఉంది అనడంలో సందేహం లేదు.హీరోగా ప్రభాస్ ను అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాగే నేను చూపించబోతున్నాను అంటూ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) బలంగా వాదిస్తున్నాడు.షూటింగ్ కార్యక్రమాలు ఒకటి రెండు వారాల్లో పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యం లో ప్రభాస్ యొక్క అభిమానులు సలార్ విడుదల తేదీకి సంబంధించిన కౌంట్ డౌన్ మొదలు పెట్టారు.
సరిగ్గా వంద రోజుల్లో సినిమా( Salaar Movie Release ) విడుదల కాబోతుంది అంటూ అధికారికంగా యూనిట్ సభ్యులు కూడా ఒక పోస్టర్ ను విడుదల చేయడం ద్వారా అభిమానుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.ఈ రేంజ్ లో అభిమానులు సలార్ సినిమా కోసం వెయిట్ చేయడం విడ్డూరంగా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉన్నారు.సలార్ సినిమా లో హీరోయిన్ గా శృతి హాసన్( Shruti Haasan ) నటిస్తున్న విషయం తెల్సిందే.
అంతే కాకుండా ప్రభాస్ ను రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించబోతున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి.సలార్ సినిమా యొక్క విడుదల తేదీ విషయంలో గతంలో ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ సినిమా రాబోతుందని వంద రోజుల కౌంట్ డౌన్ షురూ చేయడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.