ఎప్పుడూ అలసట, ఆకలి అనిపిస్తుందా? వెంటనే ఈ లక్షణాలను గుర్తిస్తే మీరు సేఫ్..!

సాధారణంగా ఎప్పుడు అలసటగా,( Tired ) మైకము, ఆకలితో అనిపిస్తూ ఉంటే ఇది కచ్చితంగా పోషకాల లోపం కావచ్చు అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.అయితే విటమిన్ బి12 లోపం అనేది నేడు చాలా మందిని వేధిస్తూ ఉంది.

 Do You Always Feel Tired And Hungry? If You Recognize These Symptoms Immediately-TeluguStop.com

మన శరీరం విటమిన్ బి12 సహజంగా ఉత్పత్తి చేయదు.అయితే చేపలు, మాంసం, గుడ్లు, పాలు, జిడ్డు గల చేపలలో విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది.

ఇక విటమిన్ బి12 నీటిలో కరిగే విటమిన్.ఇది వివిధ శారీరక విధుల్లో కీలకపాత్ర పోషిస్తుంది.

అలాగే ఎర్రరక్త కణాల నిర్మాణం, సరైన నరాల పనితీరు, డిఎన్ఏ సంశ్లేషణ కు చాలా అవసరం అయితే శక్తి లేకపోవడం, స్థిరమైన అలసట బి12 లోపం యొక్క సాధారణ లక్షణం అని చెప్పవచ్చు.

Telugu Anemia, Headache, Tips, Deficiency, Red, Tired-Telugu Health

అయితే రోజు వారి కార్యకలాపాలు, ఉత్పాదకత, మొత్తం జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుంది.ఇక బి12 లోపం ఉన్నవారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.అయితే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

ముఖ్యంగా విటమిన్ బి12 లోపం ( Vitamin B12 deficiency )ఉంటే మన శరీరంలో కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి.విటమిన్ బి12 లోపం ఉన్నవారికి బలహీనత సాధారణ లక్ష్యం.

ఏ పని చేసినా కూడా బలహీనంగా అనిపిస్తుంది.ఎప్పుడు అలసిపోయినట్టుగా కనిపిస్తారు విటమిన్ బి12 లోపం వలన గుండె దడ, ఒత్తిడి లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

అలాగే చర్మం పాలిపోయినట్లుగా కూడా కనిపిస్తుంది.విటమిన్ బి12 లోపం వలన ఎర్రరక్త కణాల ఉత్పత్తి తగ్గిపోయి రక్తహీనతకు దారితీస్తుంది.

Telugu Anemia, Headache, Tips, Deficiency, Red, Tired-Telugu Health

రక్తహీనత ( Anemia )ఉన్న వ్యక్తులకు చర్మం క్రమంగా పసుపు రంగులోకి మారుతున్నట్టుగా అనిపిస్తుంది.ఎందుకంటే ఎర్రరక్త కణాలు చర్మం, ఆరోగ్యకరమైన రంగుకు దోహదం చేస్తాయి.ఇక విటమిన్ బి12 లోపం వలన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఏర్పడుతుంది.ఎందుకంటే ఇది ఎర్రరక్త కణాలు ఉత్పత్తిని తగ్గిస్తుంది శరీరం ఆక్సిజన్, వాహక సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

ఇక ఈ లోపం వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు కూడా తగ్గిపోతాయి.దీంతో తల తిరగడం, అప్పుడప్పుడు తలనొప్పి( Headache ) వస్తుంది.అందుకే వెంటనే ఈ లక్షణాలను గుర్తించి విటమిన్ బి12 లభించే ఆహారాలను కూడా తీసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube