తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో గెలుపొందారు.ఈ మేరకు బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై విజయం సాధించారు.
ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యతను కనబర్చిన రేవంత్ రెడ్డి సుమారు 30 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకున్నారు.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది.
అయితే రేవంత్ రెడ్డి కొడంగల్ తో పాటు కామారెడ్డిలోనూ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.కాగా అక్కడ సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ చేశారు.