ఏపీలో రానున్న ఎన్నికలలో టీడీపీకి 160 స్థానాలు రావడం ఖాయమని ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు అన్నారు.రాజమహేంద్రవరం వేదికగా ఏర్పాటైన టీడీపీ ప్రతినిధుల సభలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.28 రాష్ట్రాల సీఎంలకు రూ.508 కోట్లు ఉంటే జగన్ ఒక్కడికే అంత ఆస్తి ఉంటుందని విమర్శించారు.బెంగళూరు, ఇడుపులపాయ, లోటస్ పాండ్, అమరావతిలో ప్యాలెస్ ఎవరిదని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రతో పాటు పులివెందులలో కూడా కర్రు కాల్చి వాత పెట్టారని తెలిపారు.తరువాత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై స్పందిస్తూ వివేకా చనిపోయిన విషయం జగన్ కు ముందే తెలుసని చెప్పారు.2019లో దోపిడీ దొంగకు ప్రజలు ఓటేసి తప్పు చేశారన్నారు.అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీది ఎప్పుడు ప్రజా పక్షమేనని స్పష్టం చేశారు.