తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో మంచి ఫ్యామిలీ(Manchu Family) ఒకటి.మోహన్ బాబు(Mohan Babu) వారసులుగా మనోజ్, విష్ణు, ప్రసన్న ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఇన్ని రోజులు పాటు మనోజ్ సినిమాలకు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ ఈయన భూమా మౌనిక ( Bhuma Mounika) తో ప్రేమలో ఉన్నారన్న వార్తలు బయటపడటంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో నిలిచారు.ఇలా భూమ మౌనికతో రిలేషన్ లో ఉండడం పెద్దల సమక్షంలో తనని పెళ్లి చేసుకోవడంతో మనోజ్ తిరిగి యాక్టివ్ అయ్యారనే చెప్పాలి.
ఇలా మౌనికను పెళ్లి చేసుకోవడమే కాకుండా ఈయన సినిమాలకు కూడా కమిట్ అవుతూ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మంచూ మనోజ్ తన గురించి గతంలో వచ్చిన వార్తలపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.తనకు భూమా మౌనికతో పెళ్లికాకముందే బలవంతంగా మరొక హీరోయిన్ తో పెళ్లి చేశారు అంటూ ఈ సందర్భంగా మనోజ్ తన గురించి వచ్చినటువంటి వార్తలను చెబుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇలా మౌనికతో కన్నా ముందుగా ఈయనకు ఏ హీరోయిన్ తో పెళ్లి చేశారనే విషయానికి వస్తే రాఘవేంద్రరావు (Raghavendra Rao) దర్శకత్వంలో మనోజ్, తాప్సి(Taapsee) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఝుమ్మంది నాదం(Jhummandi Naadam).ఈ సినిమా తర్వాత హీరోయిన్ తాప్సీ తో తనకు సోషల్ మీడియాలో పెళ్లి చేశారంటూ తన గురించి వచ్చినటువంటి రూమర్లపై ఈ సందర్భంగా మనోజ్ స్పందిస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.అయితే ప్రస్తుతం మనోజ్ మాత్రం భూమ మౌనికను రెండవ వివాహం చేసుకొని తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.