యాదాద్రి భువనగిరి జిల్లా: జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ళలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ను ముట్టడించి,కలెక్టరేట్ మార్గాన్ని దిగ్బంధం చేస్తూ ఆ మార్గంలో రాకపోకలు అడ్డుకుని,ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కాంగ్రెస్ శ్రేణులు హోరెత్తించారు.ఒకదశలో కలెక్టరేట్ లోనికి చొచ్చుకు పోయేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్( Congress ) శ్రేణులను పోలీసులు అడ్డుకొని నిలువరించారు.
ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాటజరిగింది.
అనంతరం డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేష్ ల ఆధ్వర్యంలో ప్రతినిధులb బృందం కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి ధాన్యం కొనుగోలు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని,కాంటాలు వేసిన ధాన్యాన్నిసకాలంలో ఎగుమతి చేయడం లేదని విమర్శించారు.తేమ, తరుగు పేరుతో అడ్డగోలుగా కోతలు పెడుతూ రైతులను శ్రమదోపిడి చేస్తున్నారనిఆరోపించారు.
ధాన్యం కొనుగోలు( Grain ) ప్రక్రియలో తీవ్రజాప్యంతో అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని,తక్షణమే రైతుల ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసి,తరుగు, కోతలు లేకుండా ఎగుమతులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో ఆలేరు,భువనగిరి, పోచంపల్లి,వలిగొండ, యాదగిరిగుట్ట,బీబీనగర్, తుర్కపల్లి తదితర మండలాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.