అధికారం చేతిలో ఉంది కదా అని ప్రజాభిప్రాయాన్ని పక్కనపెడితే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తమ తీర్పుతో స్పష్టం చేశారు కన్నడ ఓటర్లు.( Karnataka Voters ) దేశవ్యాప్తంగా మోడీపై ( Modi ) వీస్తున్న ఎదురుగాలికి రూపం ఇచ్చారా అన్నట్లు అత్యంత స్పష్టమైన మెజారిటీని కాంగ్రెస్ కు( Congress ) ఇచ్చారు 2014లో గెలిచిన మోడీకి 2019లో గెలిచిన మోడీకి మధ్య ఉన్న తేడా ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకపోవడం.
రైతుల పోరాటాల దగ్గర నుంచి క్రీడాకారుల పోరాటాల వరకు దేశంలో సంచలనం కలిగించిన ఏ పోరాటాన్ని కూడా మోడీ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు.తమ కష్టం వృధా పోకూడదని రోడ్లమీద కూర్చుని నెలల పాటు దర్నా లు చేసిన రైతులను తీవ్రంగా అవమానించి వారు విదేశీ శక్తుల చేతిలో బందీలయ్యారు అంటూ అపహాస్యం చేసిన భాజపా నాయకులు తమకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని దేశద్రోహులంటూ ముద్ర వేయడం గమనార్హం.
లౌకిక దేశమైన భారతలో హిందూ ముస్లింల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి గెలవాలనుకున్న భాజాపాకు కర్ణాటక ఓటర్లు స్పష్టమైన గుణపాఠం చెప్పారు.తమ రాజకీయాలకు స్కూలు పిల్లలను కూడా ఉపయోగించుకొని సాక్షాత్తు ముఖ్యమంత్రి మతకల్లోలాలకు మద్దతు ఇచ్చేలా మాట్లాడడటం ప్రజాస్వామ్యంలో హర్షణీయం కాదు.రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే అయితే గెలవడం కోసం చిన్నారులు మనుషుల్లో విష బీజాలు నాటడం దేశ భవిష్యత్తుకు ఎంత మాత్రం మంచిది కాదు.కలిసి ఆడుకోవాల్సిన వయసులో వారి మనసుల్లో అభద్రతాభావాన్ని రేకెత్తించిన సంఘటనలు కర్ణాటక వ్యాప్తంగా చాలా జరిగాయి.
వాటన్నిటికీ తమ తీర్పుతో చెక్ పెట్టారు కన్నడ ఓటర్లు.అభివృద్ధికి తప్ప విద్వేషానికి తమ రాష్ట్రంలో చోటు లేదని చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారు .ఎటువంటి కింగ్‌లు, కింగ్ మేకర్లు అవసరం లేకుండానే పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బాధ్యతాయుతమైన పరిపాలన అందించమని కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇచ్చారు.మరి కాంగ్రెస్ ఎంత మేరకు దానిని నిలబెట్టుకుంటుందో చూడాలి.
ప్రజాస్వామ్యంలో ప్రజల మాటే సుప్రీమ్ అని దానిని లెక్కచేయని ఏ పార్టీ అయినా తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఈరోజుతో నిరూపణ అయింది.మరి ఇప్పటికైనా పార్టీలు ప్రజాభిప్రాయం విషయం లో జాగ్రత్తగా ఉంటాయో లేదో చూడాలి
.