విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ), బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే( Ananya Pandey ) కలిసిన నటించిన పాన్ ఇండియా సినిమా లైగర్.పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యే భారీ డిజాస్టర్ ను చవిచూసిన విషయం తెలిసిందే.
అటు విజయ్ కెరీర్ లో ఇటు పూరి జగన్నాథ్( Puri Jagannath ) కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.గత ఏడాది ఆగస్టు 25న ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.
అయితే సినిమాకు ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొనడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకొని ఈ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ భారీగా నష్టపోయారు.అయితే ఇప్పటికే ఒకసారి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి పూరి జగన్నాథ్‌పై ఒత్తిడి పెరిగింది.

తీవ్రంగా నష్టపోయామని డబ్బులు తిరిగివ్వాలని వాళ్లు గోల గోల చేయగా అప్పట్లోనే పూరి జగన్నాథ్ లీగల్‌గా తనకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా మోరల్ వేల్యూస్‌తో డబ్బులు ఇస్తానని అన్నారు.దాంతో అప్పట్లో గొడవ సద్దుమణిగింది.ఇది ఇలా ఉంటే తాజాగా నైజాం ఏరియా ఎగ్జిబిటర్స్( Nizam Area Exhibitors ) హైదరాబాద్ లోని ఫిల్మ్ చాంబర్ ముందు ధర్నాకు దిగారు.పూరి జగన్నాథ్ తమకు న్యాయం చేయాలి అంటూ పెద్ద ఎత్తున నిరసన చేయడంతో ఈ విషయం తెలుసుకున్న ఛార్మి మెయిల్ ద్వారా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ను సంప్రదించారు.
సమస్య గురించి మాకు తెలిసింది.

అందరికీ న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటాం అని మెయిల్ లో సమాధానమిచ్చారు ఛార్మి( Charmy ).ఆమె లైగర్ నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించారు.దీనిపై తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.
నైజాం ఏరియాకు సంబంధించిన లైగర్ మూవీ హక్కులను శ్రీనివాస్ అనే వ్యక్తికి ఇచ్చారు.చివరకు ఆ శ్రీనివాస్ రూ.9 కోట్లు కట్టాల్సి వచ్చినా దాన్ని తీసుకోకుండా సమస్యను సద్దుమణిగేలా చేశారు.ఇప్పుడు మళ్లీ ఈ ఇష్యూ జరిగింది.
ఇందులో పెద్ద పెద్ద వాళ్లు వాళ్ల పేమెంట్స్ ఇవ్వమని అడిగితే, నిజంగా ఏ ఎగ్జిబిటర్స్ అయితే నష్టపోయారో వాళ్లకి నైతికంగా బాధ్యత వహిస్తూ డబ్బులు ఇస్తామని అన్నారు.ఎగ్జిబిటర్స్‌కి శ్రీనివాస్ డబ్బులు కట్టాలి.
కానీ తను అంత అమౌంట్ కట్టే పోజిషన్‌లో లేడు.ఇక్కడ థియేటర్స్ ఓనర్స్, థియేటర్స్ లీజుకు తీసుకుని నష్టపోయినవారు కూడా ఉన్నారు.
మళ్లీ పూరి కనెక్ట్ బ్యానర్‌పై పూరి, ఛార్మి కలిపి సినిమా చేస్తున్నారు.రేపు అది రిలీజ్ కావాలంటే ఇక్కడ ఇబ్బంది ఉంటుంది.
ఆ సినిమాలో డబ్బులు వచ్చిన తర్వాత చాంబర్, కౌన్సిల్‌ను పెట్టుకుని నిజంగా డబ్బులు ఎవరైతే నష్టపోయారో వారికి ఇస్తాం.అలా కాకుండా పెద్ద వాళ్లు మాకిచ్చెయ్ అంటే ఇవ్వం అని క్లియర్‌గా చెప్పేశారు అని తెలిపారు.