మీరు విన్నది నిజమే.ఈ విశ్వ పటంలో హైదరాబాద్ ( Hyderabad ) నగరం జెండా రెపరెపలాడింది.అవును, ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల జాబితాలో మన భాగ్యనగరి చోటు దక్కించుకోవడం విశేషం.2012 నుంచి 2022 పదేళ్ల కాలంలో హైదరాబాద్ లో దండిగా సంపాదిస్తున్న బడాబాబుల సంఖ్య భారీగా పెరిగినట్లుగా తాజా నివేదిక వెల్లడించింది.ఈ నివేదిక 2023ను హెన్లీ అండ్ పార్టనర్స్( Henley and Partners ) వెల్లడించింది.ఈ జాబితాలో మొత్తం 97 నగరాలు పట్టణాలు చోటు దక్కించుకోగా మొదటి స్థానంలో అమెరికాలోని న్యూయార్క్ సిటీ ( New York City )నిలవగా, రెండో స్థానంలో జపాన్ రాజధాని టోక్యో నిలిచింది.
ఇందులో ముఖ్యంగా మన దేశం విషయం వచ్చేసరికి దేశ ఆర్థిక రాజధాని ముంబయి( Mumbai ) మొదటి స్థానంలో నిలిచింది.అంటే ప్రపంచ జాబితాలో చూసినప్పుడు 59400 మంది మిలియనీర్లతో 21వ స్థానంలో నిలిచి అందరినీ అవాక్కయేలా చేసింది.తర్వాత ఢిల్లీ( Delhi ) 30200 మంది మిలియనీర్లతో 36వ స్థానంలోను, బెంగళూరు 12600 మంది మిలియనీర్లతో 60వ స్థానంలోను, కోల్ కతా 12100 మంది మిలియనీర్లతో 63వ స్థానంలోను, ఇక మన హైదరాబాద్ 11100 మందితో 65వ స్థానంలో నిలిచి టాప్ 100 లిస్టులో నిలిచింది.
ఇకపోతే ప్రపంచంలో అత్యంత సంపన్నులతో కూడిన నగరాలు ఎక్కువగా అమెరికాలోనే ఉండడం గమనార్హం.అందుకే నేడు అమెరికా ప్రపంచాన్ని రూల్ చేస్తోంది.ఆసక్తికరమైన విషయం ఇక్కడ ఏమంటే సుమారు రెండు దశాబ్దాల క్రితం.2000లో సంపన్నులు అత్యధికంగా ఉన్న లండన్ మహానగరం ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోవటం కొసమెరుపు.అలాగే ఒకప్పటి రవి ఆస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం క్రమ క్రమంగా ఈ విషయంలో వెనకబడిపోవడం కొసమెరుపు.