అక్కినేని అఖిల్( Akhil ) హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఏజెంట్.ఈ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతుంది.సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ పై సూపర్ స్టార్ మహేష్( Mahesh ) కామెంట్ చేశారు.ఏజెంట్ ట్రైలర్ చాలా ఇంప్రెసివ్ గా ఉందని.అఖిల్ స్టన్నింగ్ ట్రాన్స్ ఫర్మేషన్ అని అన్నారు.
స్పెషల్ మెన్షన్ టు అనీల్ సుంకర ఇలాంటి గ్రాండ్ స్కేల్ సినిమా తీసినందుకు.ఎంటైర్ ఏజెంట్ టీం అందరికి ఆల్ ది బెస్ట్ అని అంటూ ట్వీట్ చేశారు.
ఏజెంట్ ట్రైలర్ పై మహేష్ ట్వీట్ అక్కినేని ఫ్యాన్స్ ని అలరిస్తుంది.
తన సినిమాల గురించే కాకుండా ఇతర హీరోల సినిమాల గురించి ప్రశంసించడానికి మహేష్ ఎప్పుడూ ముందుంటాడు.రీసెంట్ గా నాని దసరా సూపర్ హిట్ కాగా ఆ సినిమా చూసి మహేష్ చిత్ర యూనిట్ ని మెచ్చుకున్నారు.ఇప్పుడు ఏజెంట్ ట్రైలర్ కే మహేష్ రివ్యూ ఇచ్చేశాడు.
ఏజెంట్ ట్రైలర్ పై మహేష్ కామెంట్ అక్కినేని ఫ్యాన్స్( Akkineni fans ) నే కాదు సగటు సినీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది.మహేష్ మంచి మనసుని అందరు పొగుడుతున్నారు.