ఓ యువకుడు ఫేక్ ప్రొఫైల్ తో( Fake Profile ) రిచ్ గా కలరింగ్ ఇచ్చి యువతులను టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు.పెళ్లి చేసుకుంటానంటూ యువతులను మోసం చేయడమే ఇతని వృత్తిగా మారిపోయింది.
ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకెళితే ఉత్తర్ ప్రదేశ్ లోని( Uttar Pradesh ) ముజాఫర్ నగర్ లో విశాల్ (26) ఎంబీఏ పూర్తి చేసి, గుర్గావ్ లోని ఓ మల్టీ నేషనల్ కంపెనీలో హెచ్ఆర్ గా( HR ) ఉద్యోగం లో చేరాడు.
కానీ విశాల్ కు తక్కువ సమయంలోనే అధికంగా డబ్బు సంపాదించాలి అని అత్యాశ ఉండడంతో మూడేళ్లకే ఉద్యోగం మానేసి ఒక రెస్టారెంట్ ప్రారంభించాడు.రెస్టారెంట్ వ్యాపారం కలిసి రాకపోవడం, లక్షల్లో అప్పులు కావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అడ్డదారిలోనైనా డబ్బులు సంపాదించాలని ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు.
మ్యాట్రిమోనీ వెబ్ సైట్లలో రిచ్ బ్యాచిలర్ గా ప్రొఫైల్ సెట్ చేసుకున్నాడు.ఎవరైనా యువతులు ప్రొఫైల్ చూసి విశాల్ కు కాంటాక్ట్ అయితే.అద్దె కార్లు, దారిలో కనిపించే భవనాలు చూపించి ఇవన్నీ తనవే అంటూ రిచ్ గా బిల్డప్ ఇవ్వడం మొదలుపెట్టాడు.తరువాత అవసరం ఉందని యువతల దగ్గర అందిన వరకు దోచుకుని చివరకు ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసేవాడు.
ఈ క్రమంలో ఇతని ప్రొఫైల్ చూసి ఓ యువతి ఫ్యామిలీ కాంటాక్ట్ అయ్యారు.వారి ముందు కూడా రిచ్ గా బిల్డప్ ఇచ్చి తనకు పలు వ్యాపారాలు ఉన్నాయని గొప్పలు చెప్పాడు.తాను తరచుగా విదేశాలకు వెళ్లి వస్తుంటానని తక్కువ ధరకే విలువైన వస్తువులు తెప్పిస్తానని మాయమాటలు చెప్పడంతో, ఆ యువతి తన దగ్గర ఉన్న డబ్బులతో పాటు ఆమె స్నేహితుల నుంచి, బంధువుల నుంచి మొత్తం రూ.3.05 లక్షలు ఇచ్చింది.తరువాత ఫోన్ నెంబర్ బ్లాక్ చేయడంతో తాము మోసపోయామని గ్రహించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు ఓ మహిళ కానిస్టేబుల్ తో డెకాయ్ ఆపరేషన్ చేపించి రెడ్ హ్యాండెడ్ గా విశాలను పట్టుకున్నారు.విచారణలో ఇతడి మోసాలు బయటపడడంతో పోలీసులే షాక్ అయ్యారు.