మామూలుగా సినీ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ స్టార్ హోదా అందుకుంటే చాలు స్టార్ హీరోలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ హీరోయిన్ ను తమ సినిమాల్లోకి తీసుకుంటారు.కానీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ స్టార్ హోదా లో ఉన్నప్పటికీ కూడా ఆమెను స్టార్ హీరోలు అస్సలు పట్టించుకోవడం లేదు.
ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కాదు అనుపమ( Anupama ).అయితే అనుపమను స్టార్ హీరోలు వద్దనడానికి ఒక కారణం ఉందని తెలుస్తుంది.ఇంతకు ఆ కారణం ఏంటో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదని చెప్పాలి.
ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ తన అందాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.ముఖ్యంగా తన నూడిల్స్ లాంటి కురులతో, పెద్ద పెద్ద కళ్ళతో వారి మదిలో గుడి కట్టేసుకుంది.
అలా ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
అనుపమ తొలిసారిగా మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా.ఆ తర్వాత నితిన్( Nitin ) నటించిన ‘అఆ‘ సినిమాతో నాగవల్లి పాత్రలో బాగా ఆకట్టుకుంది.అలా ప్రేమమ్, శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యు వంటి పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ మధ్యనేవరుస సినిమాలతో కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది.
మొత్తానికి ఈ ముద్దుగుమ్మ ఒక స్టార్ హోదాలో దూసుకెళ్తుందని చెప్పవచ్చు.
బాలీవుడ్ దర్శకనిర్మాతాలు కూడా ఈ అమ్మడి వైపు దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.ఇక అనుపమ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక పోస్ట్ షేర్ చేసుకుంటుంది.
అంతేకాకుండా ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.
ప్రతి రోజు ఏదోక ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.వారు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.
చాలావరకు ఇన్స్టా రీల్స్ తో భలే సందడి చేస్తుంది ఈ కేరళ కుట్టి.నాచురల్ గా కనిపిస్తూ అందర్నీ తన వైపు మలుపుకుంది.
ఇక ఈ బ్యూటీ ఏ రోజు కూడా హాట్ ఫోజులు చేసినట్లు కనిపించలేదు.అందుకే ఈమెకు ఎక్కువగా నెగిటివ్ కామెంట్లు కూడా రావు.అలా పద్ధతి పరంగా, అందం పరంగా, నటనపరంగా అందరి మనసులు దోచుకున్నప్పటికీ కూడా స్టార్ హీరోలు మాత్రం ఈమెను అసలు పట్టించుకోవడం లేదు.అయితే దానికి ఒక కారణం కూడా ఉందని తెలుస్తుంది.
అదేంటంటే.
మొదటి నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీకి( Tollywood Industry ) చెందిన హీరోలు.అనుపమను తెలుగు ఇంటి ఆడపడుచులా చూసారని.అలాంటి బ్యూటీతో హాట్ రొమాన్స్ చేయడానికి తెలుగు హీరోలకు మనసు రావడం లేదని తెలుస్తుంది.
అంటే స్టార్ హీరోలు ఈ ముద్దుగుమ్మను సొంత ఆడపడుచు లాగా చూసుకున్నారని తెలుస్తుంది.దీంతో ఈ విషయం ప్రస్తుతం వైరల్ అవ్వటంతో.సినీ ఇండస్ట్రీలలో ఇదెక్కడ వరుసరా బాబోయ్ అంటూ కొందరు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.