రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి అదనపు టీఎంసీ కోసం పెండింగ్ భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఛాంబర్ లో పెండింగ్ భూసేకరణపై సమీక్ష నిర్వహించారు.
దీనికి సంబందించి ఇప్పటికే 70 శాతం భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన భూసేకరణ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా అధికారులు తగిన చర్యలు చేపట్టాలన్నారు.ఈ సమీక్షలో జిల్లా అదనపు కలెక్టర్లు బి.సత్య ప్రసాద్, ఎన్.ఖీమ్యా నాయక్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓ లు టి.శ్రీనివాస రావు, పవన్ కుమార్, తహశీల్దార్ నరేష్, పర్యవేక్షకులు రమేష్, తదితరులు పాల్గొన్నారు.