సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) 47 ఏళ్ళు దాటినా ఇప్పటికి కూడా యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తూ అందంలో ఏమాత్రం తీసిపోకుండా మైంటైన్ చేస్తున్నాడు.ఎప్పుడు సూపర్ కూల్ గా ఉండే మహేష్ బాబు అంటే మహిళలు పడి చచ్చిపోతారు.
గత కొద్దీ రోజులుగా మహేష్ బాబు న్యూ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నాయి.
తాజాగా మహేష్ బాబు మరో న్యూ లుక్ నెట్టింట వైరల్ అవుతుంది.
మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram ) దర్శకత్వంలో తన 28వ సినిమాను స్టార్ట్ చేసాడు. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా సెట్స్ నుండి ఒక సూపర్ కూల్ పిక్ బయటకు రాగా నెట్టింట వైరల్ అయ్యింది.ఈ ఫొటోలో త్రివిక్రమ్, నటుడు జైరాం తో పాటు మహేష్ బాబు ఉన్నాడు.ఈ పిక్ లో మహేష్ లుక్ మరోసారి అందరిని ఆకట్టు కుంటుంది.మహేష్ సూపర్ స్లిమ్ అండ్ హ్యాండ్సమ్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్నాడు.ఈ పిక్ ఫ్యాన్స్ లో మంచి వైరల్ గా మారింది.
ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.పూజా హెగ్డే, శ్రీలీల ( Sree Leela ) హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇప్పటికే వీరి కాంబోలో రెండు సినిమాలు రాగా ముచ్చటగా మూడవసారి మహేష్ తో సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తుండగా.ఆగస్టు 11న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.చూడాలి గురూజీ మహేష్ కు బ్లాక్ బస్టర్ అందిస్తాడో లేదో.