గ్రాండ్ గా లాంఛ్ అయిన 'గోపీచంద్31'.. షూటింగ్ షురూ అయ్యేది అప్పుడే!

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు.హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదిగిన గోపీచంద్ ఈ మధ్య కాలంలో హిట్ అందుకోలేక పోతున్నాడు.2014లో లౌక్యం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.అయితే ఆ రేంజ్ లో మరో హిట్ అయితే ఈయన ఖాతాలో ఇంత వరకు పడలేదు.

 Gopichand 31st Film Launched Details, Gopichand, Gopichand31, Director Harsha, K-TeluguStop.com

దీంతో వరుస సినిమాలు చేస్తూనే మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.

సీటీమార్ సినిమాతో ఒక మాదిరి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు అనుకుంటే ఆ వెంటనే పక్కా కమర్షియల్ తో మళ్ళీ ప్లాప్ అందుకున్నాడు.ఇక ప్రెజెంట్ గోపీచంద్ లౌక్యం వంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో ‘రామబాణం’ సినిమా చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఆడియెన్స్ ను అలరించాయి.

ఈ సినిమా షూట్ పూర్తి కానుండడంతో వెంటనే గోపీచంద్ మరో సినిమాను ప్రకటించాడు.తన కెరీర్ లో 31వ ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంఛ్ చేసారు.ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా కన్నడ డైరెక్టర్ ఏ హర్ష డైరెక్ట్ చేయనున్నాడు.

ఈ సినిమా రెగ్యురల్ షూట్ కూడా ఈ నెల చివరి నుండి స్టార్ట్ కానుంది.

ఇక ఈ సినిమాను వెంటనే షూట్ స్టార్ట్ చేసి శరవేగంగా పూర్తి చేయనున్నట్టు తెలుస్తుంది.కేజిఎఫ్ ఫ్రాంచైజీతో ఫేమ్ సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.ఈ మ్యూజిక్ డైరెక్టర్ సలార్ తర్వాత గోపీచంద్ సినిమాకు సైన్ చేయడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

చూడాలి గోపీచంద్ కోరుకున్న హిట్ ను ఏ డైరెక్టర్ అందిస్తాడో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube