విజయనగరం జిల్లాలో గజరాజుల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.వంగర మండలం తలగాం సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది.
పార్వతీపురం మన్యం నుంచి వంగర మండలంలోకి ఏడు ఏనుగులు ప్రవేశించిన విషయం తెలిసిందే.ఇప్పటికే మండలంలోని పలు ప్రాంతాల్లో పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి.
గజరాజుల దాడులతో వంగర మండల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఈ మేరకు అటవీశాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
తాజాగా మన్యం జిల్లా భామిని మండలంలో మరో పది ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు.దీంతో గజరాజుల దాడుల నుంచి తమను, తమ పొలాలను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.