టిడిపి అధినేత చంద్రబాబుకు పార్టీలోని కొన్ని కొన్ని పరిణామాలు చికాకు కలిగిస్తున్నాయి.రాబోయే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో చంద్రబాబు అలుపెరగకుండా నిరంతరం పార్టీ కార్యక్రమాలను పాల్గొంటున్నారు.
వైసిపి ప్రభుత్వంపై జనాలలోను వ్యతిరేకత పెంచేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.నిరంతరం ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లుందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో తప్పకుండా విజయం తమదేననే ధీమా ను కల్పిస్తున్నారు.దీనికి తగ్గట్లుగానే ఏడాదిన్నర ముందుగానే కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ.
వారు నియోజకవర్గంలో పనిచేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
వాస్తవంగా టిడిపిలో ఇంత ముందుగా టికెట్లను ఖరారు చేసే పరిస్థితి లేదు.
దీంతో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా బాబు అప్డేట్ అయ్యారని, అభ్యర్థులను ముందుగా ప్రకటించడం ద్వారా విజయవకాశాలు మెరుగవుతాయి అని టిడిపి నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే రాబోయే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు కేటాయించాలని బాబు నిర్ణయించుకున్నారు.
అయితే ఇందులో సీనియర్లు తమ వారసులకు కూడా అవకాశం కల్పించాలని చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారు.
అయితే వారసులు విషయంలో బాబు కొంతమందికి హామీ ఇచ్చినా, ఎక్కువమంది వారసులు ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతుండడంతో ముందుగానే వారికి సీటు కేటాయించే విషయంలో బాబు తర్జనభర్జన పడుతున్నారు.ఈ విషయంలో పార్టీలో ధిక్కార స్వరాలు కూడా పెరిగిపోయాయి.గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తన వారసుడు రాయపాటి రంగారావుకు సత్తెనపల్లి అసెంబ్లీ సీటు కేటాయించాలని చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారు.
ఒకవేళ అది కుదరని పక్షంలో నరసరావుపేట లో సభ నియోజకవర్గంలో పార్టీని ఓడించేందుకు సిద్దమని ఆయన హెచ్చరికలు జారీ చేశారు.ఇదేవిధంగా కొంతమంది సీనియర్ నాయకుల వారసులకి టిక్కెట్ ఇస్తామని హామీ చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా ఇవ్వడంతో వారంతా ఇప్పుడు తమను అభ్యర్థిగా ప్రకటించాలని ఒత్తిడి చేస్తున్నారట.అయినా బాబు ఈ విషయంలో ఇంకా సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో వీరంతా తమదైన శైలిలో అసంతృప్తిని వెళ్లగక్కుతూ వస్తుండడం తో చంద్రబాబు ఈ వ్యవహారాలు పెద్ద తలనొప్పిగా మారాయట.