యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వయస్సు 39 సంవత్సరాలు కాగా ఈ నెల 24వ తేదీ నుంచి ఈ సినిమా షూట్ మొదలుకానుందని తెలుస్తోంది.ఆరు నుంచి ఏడు నెలల్లో ఈ సినిమా షూట్ పూర్తి కావాలని ఫ్యాన్స్ కోరిక అని సమాచారం అందుతోంది.
అయితే చాలా సంవత్సరాల తర్వాత తారక్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.
ఎన్టీఆర్ డబుల్ రోల్ లో కనిపించడంలో వింతేం లేకపోయినా ఈ సినిమాలో తండ్రీకొడుకుల పాత్రల్లో తారక్ కనిపిస్తారనే వార్త అభిమానులను ఒకింత టెన్షన్ కు గురి చేస్తోంది.
ఆంధ్రావాలా, శక్తి సినిమాలలో సైతం తారక్ ఇదే విధంగా తండ్రీకొడుకుల పాత్రలలో కనిపించగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో సక్సెస్ ను సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాయనే సంగతి తెలిసిందే.
సముద్రం బ్యాక్ డ్రాప్ లో స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.తారక్ కు జోడీగా జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపిస్తుండగా ఈ ఇద్దరు హీరోయిన్లలో ఏ లక్కీ హీరోయిన్ ఆ ఛాన్స్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.రివేంజ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని బోగట్టా.
ఈ సినిమా తారక్ కోరుకున్న విజయాన్ని అందిస్తుందో లేదో చూడాల్సి ఉంది.
ఎన్టీఆర్ ఈ సినిమా విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉండగా మైథలాజికల్ టచ్ కూడా ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తోంది.కొరటాల శివ సైతం ఆచార్య చేదు జ్ఞాపకాలకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టే కథను సిద్ధం చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఎన్టీఆర్30 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కానుండగా ఫ్యాన్స్ కోరుకున్న విధంగా ఈ మూవీ ఉంటుందో లేదో చూడాలి.