యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సాధారణంగా ఎవరిపై కోప్పడరు.అందరితో సరదాగా ఉండటానికే తారక్ ప్రాధాన్యత ఇస్తారు.
అయితే తారక్ తన పిల్లలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అరుదుగా మాత్రమే షేర్ చేస్తున్నారు.అభయ్ రామ్, భార్గవ్ రామ్ లకు సినిమాలలో అవకాశాలు వస్తున్నా తారక్ మాత్రం అంగీకరించడం లేదు.
తన సినిమాలలో కూడా అభయ్, భార్గవ్ నటించడానికి జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకోవడం లేదు.
అయితే పిల్లల విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కఠినంగా వ్యవహరించడానికి కారణాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
తన పిల్లలు చిన్నప్పటి నుంచి సినిమాలలో నటిస్తే వాళ్ల చదువుపై, కెరీర్ పై ప్రభావం పడుతుందని తారక్ భావిస్తున్నారని సమాచారం.సినిమాల్లో సక్సెస్ సాధించడం సులువు కాదని చిన్న వయస్సులోనే పిల్లలపై సినిమాల ప్రభావం పడకూడదని తారక్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
![Telugu Abhay Ram, Bhargav Ram, Ntr, Ntr Cine, Koratala Shiva, Prashanth Neil, Ta Telugu Abhay Ram, Bhargav Ram, Ntr, Ntr Cine, Koratala Shiva, Prashanth Neil, Ta](https://telugustop.com/wp-content/uploads/2023/02/shocking-facts-about-junior-ntr-kids-cine-entry-details.jpg )
మరోవైపు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరుగుతోంది.తన పిల్లలపై ట్రోల్స్ రాకూడదని భావించి ఎన్టీఆర్ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.ఒక విధంగా ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయినా పిల్లలకు ఆసక్తి ఉంటే మాత్రం ఎన్టీఆర్ వాళ్లను సినిమాల్లోకి తీసుకురావడమే కరెక్ట్ అని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
![Telugu Abhay Ram, Bhargav Ram, Ntr, Ntr Cine, Koratala Shiva, Prashanth Neil, Ta Telugu Abhay Ram, Bhargav Ram, Ntr, Ntr Cine, Koratala Shiva, Prashanth Neil, Ta]( https://telugustop.com/wp-content/uploads/2023/02/ntr-kids-cine-entry-details-here-goes-viral-junior-ntr.jpg)
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మూవీ ఈ నెలలో పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది.ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని తారక్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని సమాచారం.జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ రెండు భాగాలుగా తెరకెక్కనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
తారక్ ప్రస్తుతం కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించడానికి ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.