టీడీపీ : బెంబేలెత్తిస్తున్న బెజవాడ రాజకీయం !

బెజవాడ రాజకీయాలు హీట్ ఎక్కాయి.ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం లో గ్రూపు రాజకీయాలు ముదిరిపోయాయి.

 Tdp Politics Of Bejawada Is Disturbing , Kesineni Mani, Kesineni Chinni, Budda-TeluguStop.com

చాలాకాలంగా ఈ గ్రూపు రాజకీయాలతో సతమతం అవుతున్నా,  ఎప్పటికప్పుడు టిడిపి అధినేత చంద్రబాబు కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.ప్రస్తుతం టిడిపి విజయవాడ ఎంపీ కేసినేని నాని బహిరంగంగానే పార్టీ నాయకుల పై విమర్శలు చేస్తున్నారు.

చాలాకాలంగా నాని వ్యవహారం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది .ఆయన పార్టీలోనే ఉంటూ పార్టీలోని నాయకులపై ప్రత్యక్షంగాను,  పరోక్షంగాను విమర్శలు చేస్తూ అధిష్టానాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు.తన సోదరుడు చిన్ని వ్యవహారంపై స్పందిస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.ఒకపక్క టిడిపి అధినేత చంద్రబాబు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అహర్నిశల పాటు పడుతున్నారు.

Telugu Bejawada, Bonda Uma, Budda Venkanna, Devineni Uma, Kesineni Chinni, Kesin

 తన వయసును కూడా లెక్కచేయకుండా జనాల్లో తిరిగేందుకు రకరకాల కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. 2024 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాకపోతే పార్టీ పరిస్థితి దారుణంగా తయారవుతుందనే టెన్షన్ బాబును వెంటాడుతుండగా,  ఇప్పుడు పార్టీలోని నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు తలెత్తడం ఆ ప్రభావం రాబోయే ఎన్నికల పైన పడబోతుండడంతో చంద్రబాబులో ఈ టెన్షన్ పెరుగుతుంది.కేశినేని నాని గత కొద్దిరోజులుగా చేస్తున్న కామెంట్స్ హైలెట్ అవుతున్నాయి.విజయవాడ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాని పర్యటిస్తూ సంచలన కామెంట్లు చేస్తున్నారు.

దీంతో ఈ ఏడు నియోజకవర్గాల్లోనూ పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి.విజయవాడ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గల్లోని పార్టీ కేడర్ కూడా అయోమయానికి గురవుతోంది.

ప్రస్తుతం నాని వెంట వెళ్లాలా లేక ఆయన సోదరుడు కేసినేని చిన్నికి టిడిపి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉండడంతో ఆయన వెంట వెళ్లాలా అనేది గందరగోళంగా మారింది .
 

Telugu Bejawada, Bonda Uma, Budda Venkanna, Devineni Uma, Kesineni Chinni, Kesin

  ఈ విషయంలో టిడిపి అధిష్టానం కూడా ఏ ప్రకటన చేసేందుకు ఇష్టపడడం లేదు.అయితే నాని రాబోయే ఎన్నికల్లో తాను ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడంతోనే కేసినేని చిన్ని లైన్ లోకి వచ్చారని, కానీ ఇప్పుడు నాని ఈ విధంగా రాజకీయం మార్చారని నాని వ్యతిరేక వర్గీయులు ప్రచారం చేస్తున్నారు.ఏదైనా ఇబ్బంది,  అసంతృప్తి ఉంటే నేరుగా పార్టీ అధిష్టానానికి నాని చెప్పుకోవాలి కానీ,  ఇలా బహిరంగంగా పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే విధంగా కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ టిడిపి నాయకులే మాట్లాడుతున్నారు.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube