ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం తీసుకురావాలని గతంలో చాలా సార్లు ప్రయత్నించిన విషయం తెలిసిందే.ఈ మేరకు ఉన్నత అధికారులకు చాలాసార్లు విజ్ఞప్తి కూడా చేశారు.
ఈ విషయం పట్ల అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్( Urban MLA Daggupathi Venkateswara Prasad ) గతంలో కూడా మంజూరు చేయాలంటూ కోరిన విషయం తెలిసిందే.తాజాగా ఇదే విషయంపై మరోసారి స్పందించారు.

త్వరలోనే అనంతపురం నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీని తీసుకొస్తాము అని ఆయన తెలిపారు.ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గురించి బడ్జెట్ సమావేశాలలో చర్చిస్తామని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు.ఈ విషయం పట్ల సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గురించి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్( Public Health Department, Municipal Commissioner, Town Planning ), ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

కాగా ఇందుకు సంబంధించిన సమీక్ష సమావేశం ఆర్.అండ్.బి అతిథి గృహంలో ఉండనుందట.ఈ సమావేశంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థపై చేపట్టవల్సిన అంశాలపై చర్చలో జరగనున్నాయి.ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం దాదాపుగా 750 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తీసుకురానున్నారట.ఇదే విషయం గురించి తాజాగా ఎమ్మెల్యే దగ్గుబాటి స్పందిస్తూ ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ ని కూడా చేసారు.
మరి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఎప్పుడు మొదలుకానుంది? సమావేశం తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఉన్నారు అన్న విజయాలు తెలియాల్సి ఉంది.