దక్షిణాది యాత్ర షురూ చేసిన ఏపీ డిప్యూటీ సీఎం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) దక్షిణాది రాష్ట్రాల పుణ్యక్షేత్రాల యాత్రకు శ్రీకారం చుట్టారు.హైదరాబాద్ నుంచి బయల్దేరిన పవన్ కల్యాణ్ కొచ్చి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.

 Ap Deputy Cm Pawan Kalyan Temples Tour Details, Pawan Kalyan, Janasena, Ap Deput-TeluguStop.com

ఈ పర్యటనలో ఆయన కేరళ,( Kerala ) తమిళనాడు( Tamil Nadu ) రాష్ట్రాల్లోని పలు ప్రముఖ దేవాలయాలను దర్శించుకోనున్నారు.

పర్యటన ప్రారంభంలోనే కేరళలోని కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని( Sri Agasthya Maharshi Temple ) పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు.

ఆ తర్వాత మూడు రోజులపాటు పవన్ వివిధ దేవాలయాలను దర్శించుకుంటారు.అందులో తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం, మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం, శ్రీ పరశురామ స్వామి దేవాలయం, తమిళనాడులోని కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.

Telugu Ap Deputy Cm, Janasena, Kerala Temples, Kochi, Pawan Kalyan, Sanatana Dha

ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ గతంలో మొక్కుకున్న మొక్కులను కూడా తీర్చుకోనున్నారు.సనాతన ధర్మ( Sanatana Dharma ) పరిరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ యాత్ర చేపట్టారు.సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడం, పరిరక్షించడానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Telugu Ap Deputy Cm, Janasena, Kerala Temples, Kochi, Pawan Kalyan, Sanatana Dha

ఈ పర్యటనకు పవన్ అభిమానులు, జనసేన శ్రేణులు భారీగా స్పందిస్తూ ఆయనకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు.దక్షిణాది పుణ్యక్షేత్ర యాత్రతో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఆధ్యాత్మికతకే కాకుండా ప్రజల్లో సనాతన ధర్మంపై అవగాహన పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.గత కొన్ని రోజులుగా అనారోగ్యం సమస్యల కారణంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడ్డారు.

దాని నుండి కోరుకున్న తర్వాత ఈ యాత్రను కొనసాగించడం నిజంగా ఆయనకు ఆధ్యాత్మిక చింతన పై ఉన్న విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube