హెయిర్ ఫాల్.దాదాపు అందర్నీ సర్వ సాధారణంగా వేధించే సమస్య ఇది.అయితే కొందరిలో మాత్రం ఇది చాలా అంటే చాలా తీవ్రంగా ఉంటుంది.పైగా హెయిర్ గ్రోత్ సైతం సరిగ్గా ఉండదు.
ఫలితంగా ఒత్తయిన జుట్టు కాస్త కొద్ది రోజుల్లోనే పల్చగా మారిపోతుంటుంది.ఈ క్రమంలోనే హెయిర్ ఫాల్ ను వదిలించుకోవడం కోసం ఖరీదైన షాంపూ, ఆయిల్స్‌ను వాడుతుంటారు.
వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుంటే ఏం చేయాలో తెలీక తెగ సతమతం అయిపోతుంటారు.
అయితే హెయిర్ ఫాల్ ఎంత తీవ్రంగా ఉన్నా సరే కేవలం ఇప్పుడు చెప్పబోయే రెండు పదార్థాలతోనే సులభంగా చెక్ పెట్టవచ్చు.
మరి ఇంతకీ ఆ రెండు పదార్థాలు ఏంటి.? వాటిని ఎలా ఉపయోగించి హెయిర్ ఫాల్ ను అడ్డుకోవాలి.? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి.
అలాగే ఒకటిన్నర గ్లాస్ హాట్ వాటర్ వేసి నైట్ అంతా వదిలేయాలి.
మరుసటి రోజు స్ట్రైనర్ సహాయంతో కలర్ ఛేంజ్ అయిన కరివేపాకు వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ అలోవెరా జెల్ వేసి బాగా మిక్స్ చేయాలి.అలాగే మూడు టేబుల్ స్పూన్లు రెగ్యులర్ షాంపూను వేసి మరోసారి మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని యూస్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారంలో రెండంటే రెండు సార్లు ఈ విధంగా చేస్తే కరివేపాకు మరియు అలోవెరా జెల్ లో ఉండే ప్రత్యేక పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.హెయిర్ ఫాల్ సమస్యను క్రమంగా దూరం చేస్తాయి.అంతే కాదు పైన చెప్పిన విధంగా వారంలో రెండు సార్లు షాంపూ చేసుకుంటే చుండ్రు సమస్య దూరం అవుతుంది.
కురులు పట్టులా మెరుస్తాయి.మరియు చిట్లిన జుట్టు సైతం రిపేర్ అవుతుంది.