మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా శంకర్ దర్శకత్వం లో దిల్ రాజు నిర్మిస్తున్న ఆర్‌సీ15 చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశకు వచ్చింది అంటూ ఆ మధ్య చిత్ర యూనిట్ సభ్యులు అనధికారికంగా ఆఫ్ ది రికార్డు పేర్కొన్నారు.కానీ ఇప్పటి వరకు సినిమా యొక్క అప్డేట్ అధికారికం గా ఇవ్వక పోవడం పట్ల అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది దసరా సందర్భంగానే రామ్ చరణ్, శంకర్ సినిమా యొక్క ఫస్ట్ లుక్ రాబోతుంది అంటూ ప్రచారం జరిగింది.కానీ దసరాకు చిన్న అప్డేట్ కూడా చిత్ర యూనిట్ సభ్యులు ఇవ్వలేదు.
దాంతో కొత్త సంవత్సరం కానుకగా కచ్చితం గా ఈ సినిమా యొక్క అప్డేట్ లేదా ఫస్ట్ లుక్ ఉంటుందని ఆశపడ్డారు.కానీ రామ్ చరణ్ ఫాన్స్ ని ఈసారి కూడా దర్శకుడు శంకర్ నిరాశ పరిచాడు.
కొత్త సంవత్సరం సందర్భంగా రామ్ చరణ్ శంకర్ సినిమా యొక్క అప్డేట్ లేక పోవడం పట్ల దిల్ రాజు పై కూడా మెగా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సినిమా విడుదల తేదీ ఎప్పుడు అనేది ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు.
అలాగే సినిమా నుండి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక అప్డేట్ ఇవ్వలేదు.ఇలాంటి సమయం లో సినిమా యొక్క ప్రమోషన్ జరిగేది ఎలా అంటూ మెగా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుండి రాబోతున్న సినిమా అవడం తో కచ్చితంగా మరో లెవెల్ అంచనాలు ఉండడం ఖాయం.అందుకే అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు శంకర్ ఈ సినిమా ను రూపొందిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.ఈ సినిమా లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.
రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు.రెండవ పాత్ర కు జోడిగా అంజలి హీరోయిన్ గా నటించింది.
మొత్తానికి ఈ సినిమా లో పలువురు స్టార్స్ కనిపించబోతున్నారు ఏక కాలం లో తెలుగు మరియు తమిళం లో రూపొందుతున్న ఈ సినిమా ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు.