టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో అనుబంధం ఉంది.చాలా సందర్భాల్లో తారక్ ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడటంతో పాటు ఆ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారు.
ఎంతోమంది ఎన్నో విమర్శలు చేసినా విమర్శలను పట్టించుకోకుండా తారక్ ముందుకు సాగారు.ఇతర పార్టీల నుంచి మంచి ఆఫర్లు వచ్చినా తాత స్థాపించిన పార్టీకే నా ప్రాధాన్యత అని తారక్ పలు సందర్భాల్లో తేల్చి చెప్పారు.
సరైన సమయం వస్తే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని కూడా తారక్ కామెంట్లు చేశారు.అయితే రాజకీయాల్లో తారక్ ఎదగకుండా తొక్కేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. లోకేశ్ కు అడ్డు వస్తున్నాడని తారక్ ను పాతాళానికి తొక్కేస్తున్నారని కొడాలి నాని అన్నారు.రాష్ట్రంలో ఎన్టీఆర్ డీ.ఎన్.ఏ లేకుండా చేయాలని తెలుగుదేశం పార్టీ కృషి చేస్తోందని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.
చంద్రబాబు నాయుడు లోకేశ్ ను ప్రజలపై రుద్దుతున్నారని కొడాలి నాని చెప్పుకొచ్చారు.రాష్ట్రంలో బీసీలను సమూలంగా నాశనం చేసే కుట్ర జరుగుతోందని కొడాలి నాని కామెంట్లు చేశారు.
సీనియర్ ఎన్టీఆర్, వైఎస్సార్ కలిస్తే ఉండేంత దమ్ము, ధైర్యం జగన్ కు మాత్రమే ఉందని కొడాలి నాని చెప్పుకొచ్చారు.ఏపీ ప్రజలకు జగన్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన కామెంట్లు చేశారు.
కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో ఒకే వేదికపై కనిపించడం లేదు.తారక్ నాని మధ్య గ్యాప్ పెరిగిందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి.రాబోయే రోజుల్లో ఈ గ్యాప్ తగ్గాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.తారక్ కొడాలి నాని కాంబినేషన్ లో పలు సినిమాలు తెరకెక్కాయనే సంగతి తెలిసిందే.తారక్ ప్రస్తుతం తర్వాత సినిమా పనులతో బిజీగా ఉన్నారు.తారక్ రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.