నవంబర్ నెలలో ఇండోనేషియాలో బాలిలో జరిగిన జీ-20 సదస్సులో ప్రధాని మోడీ పాల్గొనడం తెలిసిందే.అయితే ఈ సదస్సులో వచ్చే ఏడాది జీ-20 దేశాల అధ్యక్ష బాధ్యతలను ప్రధాని మోడీ అందుకోవటం జరిగింది.
ఈ క్రమంలో వచ్చే ఏడాది జీ-20 అంతర్జాతీయ సదస్సులకు భారత్ వేదిక కానున్న నేపథ్యంలో ఇటీవల పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది.
ఇదిలావుంటే ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సదస్సుకు విశాఖ వేదిక కానుంది.
దీంతో జీ-20 సదస్సు సన్నాహాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొననున్నారు.వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 3,4,5 తారీకులలో విశాఖ వేదికగా వ్యవసాయం, ఆర్థిక రంగం, విద్యా, వైద్యం ఇంకా వివిధ అంశాలపై 37 సమావేశాలు నిర్వహించాలని కేంద్రం డిసైడ్ అయింది.
ఈ క్రమంలో ఏర్పాట్లపై ప్రధానితో సీఎం జగన్ చర్చించనున్నట్లు సమాచారం.