చిత్ర పరిశ్రమంలో వరుస విజయాలు అందుకొని మంచి సక్సెస్ సాధించాలి అంటే ఏమాత్రం ఆటిట్యూడ్ చూపించకుండా ఎంతో అనిగిమనిగి ఉంటే ఇండస్ట్రీలో అంత మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయని ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు నిరూపించుకున్నారు.ఈ క్రమంలోని తాజాగా అడివి శేష్ సైతం బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతూ తన సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఈయన హిట్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.
ఇలా ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే అడివి శేష్ ఇతర సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు ఇక గత రెండు రోజుల క్రితం ముఖచిత్రం అనే సినిమా ట్రైలర్ లంచ్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శేష్ తాజాగా సలాం వెంకీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనారు.
ఈ సినిమాలో అలనాటి తార కాజోల్ కీలక పాత్రలో నటించారు.ఇకపోతే ఈ సినిమాకు సీనియర్ నటి రేవతి దర్శకత్వం వహించడం విశేషం.ఈ సినిమా డిసెంబర్ 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఒక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ప్రెస్మీట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా అడివి శేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడిన అనంతరం అక్కడే ఉన్నటువంటి సీనియర్ నటి రేవతి కాళ్లు మొక్కి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.ఇలా అడివి శేష్ సీనియర్ నటికి పాదాభివందనం చేయడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈయన పెద్దవారిపట్ల ప్రవర్తించే తీరుకు ఎంతోమంది ఫిదా అవుతున్నారు.