పవన్ కళ్యాణ్ హీరో గా సుజిత్ దర్శకత్వం లో ఒక సినిమా రాబోతుంది.ఆ సినిమా ను దానయ్య నిర్మించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.
నిర్మాత దానయ్య పవన్ కళ్యాణ్ తో సినిమా తెరకెక్కించ బోతున్నాడు అంటూ చాలా కాలం గా ప్రచారం జరుగుతుంది.ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా నేడు పవన్ కళ్యాణ్ మరియు సుజీత్ కాంబినేషన్ లో సినిమా ను అధికారికంగా ప్రకటించారు.
సినిమా ఎప్పుడు షూటింగ్ ప్రారంభం అవుతుంది.ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు.
కానీ మొత్తానికైతే దానయ్య నిర్మాణం లో పవన్ కళ్యాణ్ సినిమా అంటూ అధికారికంగా క్లారిటీ వచ్చేసింది.ఈ సమయం లో ప్రభాస్ సినిమా గురించి ఆయన అభిమానులు దానయ్య ను ప్రశ్నిస్తున్నారు.

ప్రభాస్ హీరో గా మారుతి దర్శకత్వం లో రాజా డీలక్స్ అనే సినిమా ను దానయ్య నిర్మించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.రాజా డీలక్స్ అనే టైటిల్ ను దానయ్య రిజిస్టర్ చేయించారని కూడా వార్తలు వచ్చాయి.కానీ ఇప్పటి వరకు ఆ విషయమై అధికారికంగా వెల్లడించ లేదు.ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో సినిమా ప్రారంభం అయ్యింది.అయినా కూడా ఇప్పటి వరకు నిర్మాత ఎవరు అనే విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు.దానయ్య అయితే ఈపాటికి ఆ విషయమై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
కానీ ఇప్పటి వరకు నిర్మాత ఎవరు అనే విషయాన్ని ప్రకటించక పోవడంతో ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రభాస్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి రెండవ షెడ్యూల్ కు సిద్ధం అవుతుంది.
ఈ సమయంలో కూడా మారుతి తో ప్రభాస్ సినిమా ను నిర్మిస్తున్నది ఎవరు అనే విషయం లో క్లారిటీ లేకపోవడం పట్ల అభిమానులు అసహనం వ్యక్తం చేస్తూ దానయ్య ను ఈ విషయంలో ప్రశ్నిస్తున్నారు.