సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు సినీ, రాజకీయ రంగాలకు చెందిన చాలామంది ప్రముఖులు హాజరయ్యారు.బాలకృష్ణ, జయప్రద, మణిశర్మ, అల్లు అరవింద్, కోట శ్రీనివాసరావు, త్రివిక్రమ్, మెహర్ రమేష్, మంచు మనోజ్, కోటి, సుధీర్ బాబు, ఆర్బీ చౌదరి, అనిల్ రావిపూడి, రఘుబాబు, తులసి, తారకరత్న, విజయచందర్, పరుచూరి గోపాలకృష్ణ, అలీ, ఖయ్యూమ్, శేఖర్ కమ్ముల, వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని కృష్ణ పార్థివదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
అయితే కృష్ణను కడసారి చూడటానికి నాగార్జున హాజరు కాకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.నాగ్ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున ప్రస్తుతం హైదరాబాద్ లేరని ఈ రీజన్ వల్లే కృష్ణ అంత్యక్రియలకు ఆయన హాజరు కాలేకపోయారని ఇంతకు మించి నాగార్జున హాజరు కాకపోవడం వెనుక మరే కారణం లేదని చెబుతున్నారు.
నాగార్జున హాజరు కాకపోయినా నాగచైతన్య, అఖిల్ హాజరయ్యారని నాగ్ సన్నిహితులు చెబుతున్నారు.
కృష్ణను అమితంగా అభిమానించే సినీ ప్రముఖులలో నాగార్జున ఒకరు.
నాగార్జున రావాలని ప్రయత్నించినా వేర్వేరు కారణాల వల్ల ఆయన రాలేకపోయారని సమాచారం.రాబోయే రోజుల్లో నాగార్జున కృష్ణ పార్థివదేహాన్ని చూడటానికి హాజరు కాకపోవడానికి గల కారణాలను వెల్లడించే అవకాశం అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
బిగ్ బాస్ షో ద్వారా నాగ్ ఇందుకు సంబంధించి స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మహేష్ తల్లి చనిపోయిన సమయంలో నాగార్జున హాజరైన సంగతి తెలిసిందే.నాగ్ ప్రస్తుతం సినిమాలకు సైతం దూరంగా ఉంటున్నారు.100వ ప్రాజెక్ట్ కు సరైన దర్శకుని కోసం నాగార్జున అన్వేషిస్తున్నారు.త్వరలో నాగ్ 100వ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.