నందమూరి బాలకృష్ణ ఇప్పుడు సినిమాలతో పాటు టాక్ షోకు హోస్ట్ గా కూడా చేస్తున్న విషయం తెలిసిందే.ఇతడు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు కొన్ని డేరింగ్ స్టెప్స్ తీసుకుంటూ కెరీర్ ను ఇప్పటికి సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నాడు.
బాలకృష్ణ మొట్టమొదటి సారిగా హోస్ట్ గా చేసిన షో ‘అన్ స్టాపబుల్’.
సినీ సెలెబ్రిటీలు పాల్గొంటున్న ఈ షో సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
ఇక సీజన్ 1 ఘన విజయం సాధించడంతో సీజన్ 2 కోసం ప్రేక్షకులంతా ఎదురు చూడగా ఇటీవలే సీజన్ 2 గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది.ఇప్పటికే మూడు ఎపిసోడ్స్ కూడా స్ట్రీమింగ్ అయ్యి ప్రేక్షకులను అలరించాయి.
ఇక నాలుగు ఎపిసోడ్ కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నాలుగవ ఎపిసోడ్ లో కిరణ్ కుమార్ ఇంకా సురేష్ రెడ్డి అతిథులుగా రాబోతున్నారు అని ఇప్పటికే నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.
అయితే ఈ ఎపిసోడ్ తర్వాత రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎవరు రాబోతున్నారు అనే విషయం నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ షోలో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం అలనాటి అందాల నటి రాబోతున్నట్టు టాక్ వస్తుంది.ఆమె మరెవరో కాదు.ఆనాటి హీరోయిన్ రాధికా శరత్ కుమార్.
ఓటిటి ప్లాట్ ఫామ్ అందుకు సంబంధించిన హింట్ కూడా ఇప్పటికే ఇచ్చింది.స్వాతిముత్యం అయినా ఆమె.స్వాతికిరణం అయినా తనే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానులు ఈమెనే వస్తుంది అని కన్ఫర్మ్ చేసుకున్నారు.ఇక మరో పోస్ట్ లో రాధికా శరత్ కుమార్ పవర్ ప్యాక్డ్ సెల్ఫీ ను పోస్ట్ చేయడంతో ఈ వార్త కాస్త వైరల్ అయ్యింది.
ఆమె ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఈమె ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు.