నాగార్జున బంగార్రాజు సినిమా తర్వాత ఇటీవల ది ఘోస్ట్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం లో రూపొందిన ఆ సినిమా కు సంబంధించిన కలెక్షన్స్ తాజాగా యూనిట్ సభ్యులను మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిని నిరాశ పరిచిన విషయం తెలిసిందే.
హీరో గా నాగార్జున ఇక పై వరుసగా సినిమా లు చేసే పరిస్థితి లేదు అంటూ ఆయన అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.ఎందుకంటే నాగార్జున వయసు కి తగ్గ పాత్రలు చేసే ఉద్దేశం తో ఇటీవల తన వద్దకు వచ్చిన చాలా కథలను వెనక్కు పంపించేశారట.
ముఖ్యంగా మన్మధుడు.రొమాంటిక్ హీరో పాత్రల తరహా సినిమా లను అస్సలు చేయొద్దని భావిస్తున్నాడట.
నాగార్జున ఇక పై చేయబోతున్న సినిమా లు చాలా విభిన్నం గా ఉండబోతున్నాయని.మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ మరియు మమ్ముట్టి చేస్తున్న సినిమాల తరహా లో ఉండబోతున్నాయని కూడా కొందరు మాట్లాడుకుంటున్నారు.
కానీ నాగార్జున అభిమానులు మాత్రం ఆయన ను ఇంకా రొమాంటిక్ సినిమాల్లోనే చూడాలని లవ్ కం యాక్షన్ సినిమాల్లో ఆయన్ని చూస్తే అదో సంతోషం అన్నట్లుగా అభిమానులు చర్చించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.భారీ అంచనాల నడుమ రూపొందిన ది ఘోస్ట్ సినిమా నిరాశ పర్చిన నేపథ్యం లో అలాంటి సినిమా లు మళ్లీ చేయక పోవచ్చు అంటూ కొందరు చర్చిస్తున్నారు.అతి త్వరలోనే అఖిల్ హీరో గా రూపొందబోతున్న ఒక సినిమా లో నాగార్జున కీలక పాత్ర లో నటించేందుకు ఓకే చెప్పాడని కూడా ప్రచారం జరుగుతుంది.ఆ సినిమా లో నాగ చైతన్య కూడా కీలక పాత్ర ను పోషిస్తాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
మొత్తానికి చైతన్య మరియు అఖిల్ లకు పోటీ అన్నట్లుగా నాగార్జున మరో 10 సంవత్సరాలు హీరో గా సినిమా లు చేస్తాడని అంత భావించినప్పటికీ అంత సీన్ లేదేమో అని ఇప్పుడు కొందరు ముచ్చటిస్తున్నారు.