గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ప్రమాదంపై సిట్ దర్యాప్తు జరగనుంది.ఈ ప్రమాదం కేసులో బ్రిడ్జి కాంట్రాక్టర్ తో సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.
ఒరెవా కంపెనీ నిర్లక్షంతోనే ప్రమాదం జరిగిందా.? అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.సదరు కంపెనీ ప్రమాదంపై వివరణ ఇచ్చింది.రూ.2 కోట్లతో కేబుల్ బ్రిడ్జి పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు తెలిపింది.మరో పదేళ్ల వరకూ గ్యారంటీ ఇచ్చినట్లు వెల్లడించింది.
కేబుల్ బ్రిడ్జి కెపాసిటీ 125 మంది మాత్రమేనని, కానీ 500 మందికి అనుమతి ఇచ్చారని కంపెనీ పేర్కొంది.కాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య 141కి చేరింది.
మరో 19 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.