ఈ ఏడాది జనవరిలో అమెరికా- కెనడా సరిహద్దుల్లో గడ్డకట్టిన స్థితిలో ఓ చిన్నారి సహా నలుగురు సభ్యుల భారతీయ కుటుంబం మరణించిన ఘటన అప్పట్లో యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తీవ్రమైన చలి, ప్రతికూల వాతావరణ పరిస్ధితుల కారణంగానే ఆ నలుగురు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
మృతులను జగదీశ్ బల్దేవ్‌భాయ్ పటేల్(39), వైశాలీబెన్ జగదీశ్‌కుమార్ పటేల్(37), విహంగి జగదీశ్‌కుమార్ పటేల్(11), ధార్మిక్ జగదీశ్‌కుమార్ పటేల్(3)గా గుర్తించారు. కెనడా-అమెరికా బోర్డర్‌కు 12 మీటర్ల దూరంలో ఉన్న మానిటోబాలోని ఎమర్సన్ వద్ద ఆ నలుగురి మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు.
ఈ కేసుకు సంబంధించి దాదాపు 10 నెలల తర్వాత దర్యాప్తులో కదలిక కనిపించింది.ఈ నలుగురి మరణాలపై విచారణ జరుపుతోన్న రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు (ఆర్‌సీఎంపీ) .కెనడాలోకి ప్రవేశించినప్పటి నుంచి బాధితుల కదలికల గురించి తెలిసిన సమాచారాన్ని పంచుకోవాల్సిందిగా పౌర సమాజాన్ని కోరారు.విచారణలో భాగంగా ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన పోలీసులకు మావన అక్రమ రవాణా ముఠా సభ్యులు తమలో తాము కమ్యూనికేట్ చేసుకోవడానికి సురక్షితమైన మెసేజింగ్ అప్లికేషన్‌లను ఉపయోగించడంతో నిందితులను కనుగొనడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
దర్యాప్తులో తెలిసిన వివరాల ప్రకారం.జగదీశ్ పటేల్ కుటుంబం జనవరి 12, 2022న దుబాయ్ నుంచి కెనడాలోని టొరంటోలో దిగింది.అనంతరం కొందరు ప్రైవేట్ వాహనంలో విమానాశ్రయం నుంచి తీసుకొచ్చారు.తర్వాత ప్రైవేట్‌గా వసతి పొందినట్లుగా తెలుస్తోంది.ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే.రైడ్ షేర్ యాప్‌లను ఉపయోగించినట్లుగా తెలుస్తోంది.
ఆ తర్వాత యూఎస్ – కెనడా సరిహద్దుల్లోకి ఎలా చేరుకున్నారు.? ఎవరు తీసుకెళ్లారు అన్న దానిపై రాయల్ కెనడా పోలీసులు ఆరా తీస్తున్నారు.