సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉంటే సెలబ్రిటీల గురించి ఏదో ఒక విధమైన ట్రోలింగ్స్ రావడం సర్వసాధారణం.వారి చేసే కొన్ని సినిమాలు కొందరికి నచ్చకపోవడం వల్ల భారీ ఎత్తున ట్రోల్ చేస్తూ ఉంటారు.
అయితే కొన్నిసార్లు చేసే ట్రోలింగ్స్ వారిని ఎంతగానో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది.అయితే కొంతమంది నెటిజన్స్ కేవలం హీరో హీరోయిన్లను మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే తన గురించి తన ఫ్యామిలీ గురించి వచ్చిన ట్రోలింగ్స్ పై మొదటిసారిగా స్పందిస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు నటుడు శివ కార్తికేయన్.
రేమో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్.
ఈ సినిమా తర్వాత ఈయన పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు.ఇకపోతే తాజాగా శివ కార్తికేయన్ నటించిన ప్రిన్స్ సినిమా అక్టోబర్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నశివ కార్తికేయన్ మొదటిసారిగా తన గురించి తన ఫ్యామిలీ గురించి వచ్చిన ట్రోల్స్ పై స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.
ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతూ మిమ్మల్ని ద్వేషించేవారు లేరు.మీరంటే అందరికీ ఎంతో అభిమానం అంటూ చెప్పగా… శివ కార్తికేయన్ స్పందిస్తూ.నేనంటే నచ్చని వాళ్ళు చాలామంది ఉన్నారు నా ట్విట్టర్ టైం లైన్ లోకి వెళ్తే నన్ను మాత్రమే కాకుండా నా ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ట్రోల్ చేసిన వారు ఉన్నారు.
అయితే నన్ను ద్వేషించే వారి కన్నా నన్ను పొగుడుతూ నేను క్షేమంగా ఉండాలని కోరుకున్న వారు చాలామంది ఉన్నారు.ఈ విధంగా వారు కోరుకోవడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను.
మనం ఏం చేసినా బాగా లేదని చెప్పడానికి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పడానికి చాలా తేడా ఉంటుంది అయితే ఏదైనా గాని మనం పట్టించుకునే విధానంలో ఉంటుంది.అందుకే ఈ మధ్యకాలంలో నా గురించి వచ్చిన ట్రోలింగ్స్ గురించి పట్టించుకోవడం మానేశానంటూ ఈ సందర్భంగా శివ కార్తికేయన్ ట్రోల్స్ పై స్పందించారు.