బిగ్ బాస్ సీజన్ 6 లో కంటేస్టెంట్ లు చేసిన పనికి బిగ్ బాస్ వారి పై పీకల్లోతు కోపంతో ఉన్నాడు.టాస్క్ ఇచ్చి ఆడి ఎంటర్టైన్ చేయమని చెబితే టాస్క్ ను పక్కన పెట్టి మరి టైం పాస్ చేస్తున్నారు అంటూ కంటెస్టెంట్ లపై మండిపడుతున్నాడు బిగ్ బాస్.
దాంతో ఎలా అయినా కంటెస్టెంట్స్ ని దారిలోకి తీసుకొని రావాలి అనుకున్న బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సభ్యుల కడుపులో మాడిస్తే అయినా దారికి వస్తారని డిసైడ్ అయ్యి హౌస్ లో ఉన్న వంట సామాగ్రి మొత్తం తీసుకున్నాడు.
ఆ తర్వాత కొద్దిసేపటికి హౌస్ మేట్స్ ఆకలేస్తుంది బిగ్ బాస్ అంటూ గట్టిగా కేకలు వేస్తూ ఆకలితో అల్లాడుతుండడంతో జాలిపడిన బిగ్ బాస్ హౌస్ లోకి ఫుడ్ పంపించాడు.
అయితే ఫుడ్ కోసం మళ్ళీ ఒక చిన్న ఫిట్టింగ్ ని పెట్టాడు.ఫుడ్ ని దక్కించుకోవాలి అంటే టాస్క్ లో గెలవాలి అంటూ హౌస్ మేట్స్ ని రెండు భాగాలుగా డివైడ్ చేసి వాళ్ళతో కబడ్డీ , రివర్స్ టగ్ ఆఫ్ వార్ టాస్క్ లను ఆడించాడు.
ఆ తర్వాత గెలిచిన టీం సభ్యులు తమ ఆహారాన్ని మిగతా టీం సభ్యులతో అనగా ఓడిన వారితో ఫుడ్ ని షేర్ చేసుకోకూడదు అని బిగ్ బాస్ ముందుగానే హెచ్చరించాడు.
అయినా కూడా గీతు అదేమీ పట్టించుకోకుండా గెలిచిన టీమ్ మెంబర్ అయిన ఆదిరెడ్డి ప్లేట్లో నుంచి కొంత ఆహారాన్ని తీసుకొని తినింది.దీంతో బిగ్‌బాస్ తన మాట పెడచెవిన పెట్టినందుకు ఇద్దరికీ కలిపి పనిష్మెంట్ ఇచ్చాడు.బయట నుంచి అంట్లు పాత్రలు పంపించి వాటిని కడగమని ఆదేశించాడు.
ఆ తరువాత ఆది రెడ్డి, గీతూ ఇద్దరూ అంట్లు తోమారు.ఈ క్రమంలోనే హౌస్ మేట్స్ వారిద్దరిపై పంచులు వేయడంతో మిగతా వారందరూ నవ్వుకున్నారు.
ఆ తర్వాత ఇద్దరూ తెగ బాధపడ్డారు.అప్పుడు ఆదిరెడ్డి నేను ఇంతవరకు ఎప్పుడూ అంట్లు తోమిందే లేదు అని అనగా అప్పుడు గీతూ మా ఇంట్లో జై కడుక్కోవడానికి కూడా గిన్నె తెచ్చి ఇస్తారు అని చెబుతుంది.
అప్పుడు వెంటనే ఆది రెడ్డి ఇదేం టార్చర్‌రా బాబు అని తల పట్టుకున్నాడు.