ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ అనారోగ్యం బారిన పడ్డారు.మియామి ఎయిర్ పోర్టులో వీల్ చైర్ లో ఆయన కనిపించారు.
దీంతో అభిమానులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే, సయాటికా అనే సమస్యతో బాధపడుతున్నట్టు మైక్ టైసన్ తెలిపారు.
దీని కారణంగా వెన్ను కింది భాగం, పిరుదులు, కాళ్లలో తీవ్రమైన నొప్పి వస్తుందని చెప్పారు.ఈ నొప్పి మరింత ఎక్కువైనప్పుడు కనీసం మాట్లాడలేనన్న ఆయన.
ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గానే ఉందని వెల్లడించారు.