తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి ఎంత క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవి ఏ విధమైనటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్వయంకృషితో అంచలంచలుగా చిత్ర పరిశ్రమలో ఎదిగి నేడు ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి అండతో ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా మెగా అండదండలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఒకరు.
బుచ్చిబాబు దర్శకత్వంలో తెరికెక్కిన ఉప్పెన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కొట్టి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.ఈ విధంగా ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈయనకు అనంతరం క్రిష్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం వచ్చింది.
కొండ పొలం నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేదు.ఇక ఈ సినిమా అనంతరం ముచ్చటగా మూడోసారి ఈయన గిరీషయ్య దర్శకత్వంలో తెరకెక్కిన రంగ రంగ వైభవంగా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇక ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేక పోయిందని తెలుస్తుంది.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వైష్ణవ్ తేజ్ యాంకర్ రష్మీ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు యాంకర్ ప్రశ్నిస్తూ మీ సినిమాలో కనుక ఐటమ్ సాంగ్ ఉంటే ఐటమ్ సాంగులో ఏ హీరోయిన్ నటించాలని భావిస్తారని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు వైష్ణవ్ సమాధానం చెబుతూ యాంకర్ రష్మీ నటించాలని కోరుకుంటాను అంటూ షాకింగ్ సమాధానం చెప్పారు.
రష్మీలో హాట్ ఎక్స్ ప్రెషన్స్ పలికించే తీరు తనకు నచ్చుతుందని అందుకే తన సినిమాలో ఐటమ్ సాంగ్ లో రష్మి చేస్తే బాగుంటుందంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఇది తెలిసి నెటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు.
మరి నిజంగానే వైష్ణవ్ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటే రష్మికి అవకాశం ఇస్తారో లేదో వేచి చూడాలి.