అంతకుముందు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ కొన్ని సినిమాల్లో సెకండ్ విలన్ గా కూడా నటించి మెప్పించాడు.డీజే టిల్లు సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న సిద్ధు ఇప్పుడు డీజే టిల్లు 2 తో మరోసారి ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నాడు.
ఇక ఈ సినిమాతో పాటుగా మరో రీమేక్ సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తుంది.మళయాళంలో ఈమధ్యనే రిలీజై సూపర్ హిట్ అంద్దుకున్న తల్లుమలా సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారట.
ఈ రీమేక్ లో టిల్లు అదేనండి మన సిద్ధు జొన్నలగడ్డని హీరోగా ఫిక్స్ చేశారట.ఎంటర్టైనిన్ గా సాగే ఈ సినిమా సిద్ధుకి పర్ఫెక్ట్ రీమేక్ అని చెప్పొచ్చు.
ఖాలిద్ రెహమాన్ డైరక్షన్ లో తెరకెక్కిన తల్లుమలా సినిమా ఆగష్టు 12న రిలీజై సూపర్ హిట్ అయ్యింది.ఈ సినిమా తెలుగు రీమేక్ కూడా వర్క్ అవుట్ అవుతుందని తెలిసి వెంటనే మేకర్స్ ఆ సినిమా రైట్స్ కొనేశారు.
తల్లుమలా సినిమాలో హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శన్ నటించింది.మరి తెలుగులో డీజే టిల్లుకి జోడీగా ఎవరు నటిస్తారో చూడాలి. డీజే టిల్లు 2 పూర్తి కాగానే ఈ రీమేక్ ని చేయనున్నాడు సిద్ధు.