చైనా కంపెనీ సంచలనం.. ఆ స్మార్ట్‌ఫోన్‌కు ఏకంగా 21000 ఎంఏహెచ్ బ్యాటరీ

రోజురోజుకూ టెక్నాలజీ పెరుగుతోంది.ఈ క్రమంలో మనం వాడే ఫోన్లలో చాలా మార్పులు వస్తున్నాయి.

 Chinese Company's Sensation 21000 Mah Battery For That Smartphone , China, New-TeluguStop.com

కెమెరా, స్క్రీన్, మెమొరీ, బ్యాటరీ సామర్ధ్యాలు గణనీయంగా పెరుగుతున్నాయి.రోజూ కొత్తగా ఏదో ఒక మొబైల్ మనలను ఆకర్షిస్తుంటుంది.

అయితే చాలా మందికి ఫోన్ ఛార్జింగ్ అనేది ఒక్కోసారి సమస్యగా మారుతూ ఉంటుంది.అలాంటి సమయాల్లో ఒక్కోసారి ఫోన్ అకస్మాత్తుగా స్విచ్ ఆఫ్ అయిపోతుంటుంది.

ముఖ్యంగా ప్రయాణాలు చేసే సమయాల్లో ఇబ్బందిగా ఉంటుంది.దీంతో ఈ సమస్యకు చెక్ పెట్టేలా ఓ చైనా కంపెనీ సరికొత్త ఫోన్ ఆవిష్కరించింది.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

చాలా మంది స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా ఉండాలని కోరుకుంటారు.

బ్యాటరీ బ్యాకప్ పెంచడానికి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తూ అనేక ట్రిక్స్ కూడా పాటిస్తుంటారు.అయితే ఈరోజు మనం అలాంటి స్మార్ట్‌ఫోన్ గురించి తెలుసుకుందాం.

చైనాకు చెందిన ‘ఔకిటెల్ డబ్ల్యూపీ19’ ఏకంగా 21,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫోన్ తయారు చేసింది.ఈ ఫోన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2-3 రోజులు కాకుండా దాదాపు 100 రోజుల స్టాండ్‌బై బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.

డబ్ల్యుపీ 19 మొబైల్.ఫోన్ కేటగిరీలో ఇప్పటివరకు ఒక వారం పాటు ఉండే అతిపెద్ద బ్యాటరీని అమర్చింది.

మీరు నిరంతరాయంగా సినిమాలు చూడటం, గేమ్‌లు ఆడటం, వెబ్‌సైట్‌లను బ్రౌజింగ్ చేయడం వంటివి ఇబ్బంది లేకుండా కొనసాగించవచ్చు.ఈ ఫోన్‌కు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.

ఈ భారీ బ్యాటరీ సామర్థ్యాన్ని రీఫ్యూయల్ చేయడానికి, కేవలం కొన్ని గంటలు మాత్రమే సరిపోతుంది.దీని ధరను 269.99 యూఎస్ డాలర్లుగా నిర్ణయించారు.భారత కరెన్సీలో దీని ధర రూ.22 వేలు.ఈ స్మార్ట్‌ఫోన్ డిస్ ప్లే 6.78 అంగుళాలు ఉంటుంది.ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో దీనిని తయారు చేశారు.

గేమింగ్ అనుభవాన్ని మెరుగుపర్చేందుకు 90 Hz రిఫ్రెష్ రేట్‌ను అమర్చారు.ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube