కోడి రామకృష్ణ తలకట్టు వెనుక అసలు రహస్యం తెలిస్తే షాకవ్వాల్సిందే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో కోడి రామకృష్ణ ఒకరనే సంగతి తెలిసిందే.కొన్నేళ్ల క్రితం వరకు వరుసగా సినిమాలను తెరకెక్కించిన ఈ స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న డైరెక్టర్లలో కోడి రామకృష్ణ ఒకరు కావడం గమనార్హం.తెలుగులో ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన కోడిరామకృష్ణ ఇతర భాషల సినిమాలకు సైతం దర్శకత్వం వహించడం గమనార్హం.

 Secret Behind Director Kodi Ramakrishna Head Band Details, Director Kodi Ramakri-TeluguStop.com

కోడి రామకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన నాగాభరణం సినిమా 2016 సంవత్సరంలో థియేటర్లలో విడుదలై ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.అయితే సినిమాలతోనే కాకుండా ఆహార్యంతో కూడా కోడి రామకృష్ణ వార్తల్లో నిలిచారు.

బయట ఫంక్షన్లు, షూటింగ్ లలో తెల్ల కట్టుతో ఆయన ఎక్కువగా కనిపించేవారు.తెల్ల కట్టుతో కనిపించడం గురించి కోడి రామకృష్ణ ఒక సందర్భంలో అభిమానులతో పంచుకున్నారు.

Telugu Band, Balachander, Kodiramakrishna, Secret, Sr Ntr, Tharingini-Movie

తరంగిణి మూవీ షూటింగ్ సమయంలో సీనియర్ ఎన్టీఅర్ మేకప్ మ్యాన్ మీ నుదురు భాగం పెద్దగా ఉందని ఎండ తగలకుండా ఉంటుందని నుదుటికి తెల్ల కర్చీఫ్ కట్టారని కోడి రామకృష్ణ చెప్పుకొచ్చారు.ఆ తెల్ల కర్చీఫ్ ను తలకట్టులా కట్టుకున్న రోజు కోడి రామకృష్ణ తన వర్క్ ను ఉల్లాసంగా ఉత్సాహంగా పూర్తి చేయడంతో ఆయన దానిని సెంటిమెంట్ గా కొనసాగించారు.

Telugu Band, Balachander, Kodiramakrishna, Secret, Sr Ntr, Tharingini-Movie

ఆ తర్వాత కె.బాలచందర్ సైతం ఒక సందర్భంలో బ్యాండ్ మీకు ప్రత్యేక గుర్తింపును ఇస్తుందని ఈ బ్యాండ్ పూర్వజన్మ బంధానికి సంకేతం అని చెప్పడంతో కోడి రామకృష్ణ బ్యాండ్ ను కొనసాగించారు.దేవి, అమ్మోరు, దేవుళ్లు సినిమాలు కోడి రామకృష్ణకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయని చెప్పవచ్చు.కోడి రామకృష్ణ వరుస సినిమాలతో బిజీ కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube