అక్షయ్ తో కలిసి 'ఊ అంటావా' స్టెప్పులేసిన సామ్..వీడియో వైరల్!

స్టార్ హీరోయిన్ లలో ఒకరైన సమంత ప్రెసెంట్ టాప్ లో కొనసాగుతుంది.విడాకుల తర్వాత పడి లేచిన కెరటంగా వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో దూసుకు పోతుంది.

 Samantha And Akshay Kumar Dancing To Oo Antava Details, Shaakuntalam, Samantha,-TeluguStop.com

ఫోటో షూట్స్ తో ప్రతి నిత్యం సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తూనే ఉంది.అయితే ఈమెపై ట్రోల్స్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి.

అయినా ఈమె పట్టించుకోకుండా తన పని తాను చేసుకు పోతుంది.ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండడం వల్ల ఫాలోవర్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నారు.

ఇక ఈమె ప్రెసెంట్ నటించిన శాకుంతలం, యశోద సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన ఖుషీ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.

ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో కూడా ఈమె సినీ అవకాశాల కోసం ట్రై చేస్తుంది.ఇప్పటికే ఈమె అవకాశాలు అందుకుంటుంది అని ఇన్సైడ్ టాక్ నడుస్తుంది.

సమంత తన కెరీర్ లో మొదటిసారి ఒక ఐటెం సాంగ్ కు స్టెప్పులు వేసిన విషయం విదితమే.

ఊ అంటావా మావా. అనే సాంగ్ కు సమంత అల్లు అర్జున్ తో కలిసి స్టెప్పులు వేసి రచ్చ రచ్చ చేసింది.పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసి సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఒక ఊపు ఊపేసింది.

విడాకుల తర్వాత ఈమె చేసిన ఈ ఐటెం సాంగ్ తో ఈమె పేరు మారుమోగి పోయింది.అయితే తాజాగా సామ్ ఇదే పాటకు మరోసారి స్టెప్పులు వేసింది.

బాలీవుడ్ లో ప్రసారం అవుతున్న అత్యంత ప్రజాధారణ పొందిన షోలలో కాఫీ విత్ కరణ్ ఒకటి.ఈ షో ఇప్పటికే 6 సీజన్స్ పూర్తి చేసుకుని 7వ సీజన్ ప్రసారం అవుతుంది.ఈ షోకు తాజాగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, సమంత కలిసి వచ్చారు.3వ ఎపిసోడ్ గా రేపు ప్రసారం కాబోతుంది.తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ప్రేక్షకులను ఆకట్టు కుంటుంది.ఇందులో సమంత, అక్షయ్ ఇద్దరు కలిసి ఊ అంటావా అనే సాంగ్ కు స్టెప్పులు వేసి స్టేజ్ ను ఊపేసారు.

ఈ ఎపిసోడ్ కోసం అక్షయ్ ఫ్యాన్స్ కంటే సామ్ ఫ్యాన్స్ నే ఎక్కువగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube