సీనియర్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ ల వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.నిత్యం వీరి విషయంలో ఏదో ఒక వార్త వెలుగులోకి వస్తూనే ఉంది.
గత కొద్ది రోజులుగా వీరిద్దరి రిలేషన్ విషయంలో రకరకాల రూమర్స్ అనిపిస్తూ ఉండగా వాటిని మరింత పెద్దలు చేస్తూ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే.ఇదే విషయంపై నరేష్, పవిత్ర లోకేష్ స్పందిస్తూ అండగా నిలబడమంటూ మీడియాని కోరిన విషయం తెలిసిందే.
కాగా మొదట ఏదో చిన్న గొడవల మొదలైన ఈ వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారుతుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఇదే విషయంపై సుచేంద్రప్రసాద్ స్పందించారు.
అయితే తనకు వివాహం జరగలేదని సుచేంద్రప్రసాద్ తో కూడా సహజీవనమే చేశాను అంటూ పవిత్ర లోకేష్ చెప్పింది అంటూ ప్రచారాలు కొనసాగగా తాజాగా ఆ విషయంపై స్పందించిన సుచేంద్ర ప్రసాద్.అసలు నరేష్ అనే వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదు అన్న విషయం తాజాగా కనడ మీడియాతో తెలిపినట్లు సమాచారం.
అయితే తన భార్య సంబంధాలపై మీడియా కొంతమంది స్నేహితుల ద్వారా అసలు విషయం తెలుసుకొని సుచేంద్ర ప్రసాద్ లోకల్ మీడియాతో మాట్లాడారు అని తెలుస్తోంది.

అయితే పవిత్ర చెప్పినట్టు జరిగిన ప్రచారం నిజం కాదని తాము నిజంగా పదహారేళ్ల క్రితం హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకుందామని తెలిపారు సుచేంద్రప్రసాద్.తామిద్దరం దంపతులమని రుజువు చేసే ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. పాస్పోర్టులో భార్యగా పవిత్ర పేరు భర్తగా ఆమె పాస్పోర్టు నా పేరు ఉన్నాయి అని సురేంద్ర ప్రసాద్ తెలిపారు.
ఆధార్ కార్డులో కూడా భార్యాభర్తలుగా పేర్లు నమోదు అయ్యాయి అని సుచంద్రప్రసాద్ తెలిపారు.అంతేకాకుండా వారి పెళ్లికి ప్రేమకు గుర్తుగా ఇద్దరి పిల్లలు కూడా ఉన్నారని ఆయన తెలిపారు.
అంతేకాకుండా పవిత్రను తాను ఉద్దేశించి ఏవో కామెంట్స్ చేసినట్టు ప్రచారాలు కొనసాగుతున్నాయని అయితే వాటిలో ఎటువంటి నిజం లేదని వారిని కొట్టి పడేశారు.అయితే సుచిత్ర తనతోపెళ్లి జరగలేదని, కేవలం సహజీవనం చేశామని, ఆ తర్వాత విడిపోయామని ఎందుకు చెప్పిందో తనకు అర్థం కావడం లేదు అని తెలిపారు.