కాన్వాయ్ ఆపి మరీ మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం నాడు తిరుపతి శ్రీకాళహస్తి పర్యటించడం తెలిసిందే.తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్మితమైన వకుళమాత ఆలయాన్ని ప్రారంభించారు.

 Ys Jagan Who Stopped The Convoy And Expressed His Humanity Details, Ys Jagan, Ti-TeluguStop.com

అనంతరం శ్రీకాళహస్తిలో అపాచీ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.అయితే ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్ కాన్వాయ్ బయలుదేరుతుండగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

రోడ్డు పక్కనే వినతిపత్రం అందుకుని దంపతులు కూర్చుని ఉన్నారు.ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేరు కానీ కాన్వాయ్ లో ఉన్న సీఎం జగన్ గమనించి వెంటనే భద్రతా సిబ్బంది చేత ఆ దంపతుల నుండి వినతి పత్రాలను తీసుకోవడం జరిగింది.

వివరాల్లోకి వెళితే శ్రీకాళహస్తికి చెందిన మహేష్ రెండు సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో చేయి విరిగిపోయి కాలు పనిచేయడం లేదు.ఈ క్రమంలో వైద్యం కోసం ఏడు లక్షల రూపాయలు ఖర్చు చేశారు.

ఉన్న ఆస్తంతా ఖర్చు పెట్టేశారు.తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలో ఉండటంతో.

మెడికల్ బిల్ రియంబర్స్మెంట్ కోసం మూడేళ్ళ నుండి ఎదురు చూస్తున్నారు.అయితే ముఖ్యమంత్రి జగన్ గురువారం నాడు శ్రీకాళహస్తి పర్యటనకి వస్తున్నారని తెలుసుకుని రోడ్డు పక్కన నిల్చుని ఉండటంతో జగన్ తన పర్యటన ముగించుకుని వెళుతున్న సమయంలో సరిగ్గా మహేష్ దంపతులు నిలిచి ఉన్నచోట.

రేణిగుంట విమానాశ్రయం వెళ్తున్నా రోడ్డు పక్కన ఉండటంతో వారి దగ్గర వినతి పత్రాలు భద్రతా సిబ్బంది ద్వారా నుండి తీసుకోవడం జరిగింది.వీడియో సోషల్ మీడియాలో రావటంతో చాలా మంది నెటిజన్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ కి మానవత్వం ఎక్కువే అని కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube