రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ టోకరా..భార్యాభర్తలు అరెస్ట్

నగరంలోని సుగ్గలవారి తోట ప్రాంతానికి చెందిన దాసరి సరిత అనే మహిళ తమ వారికి రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని సుమారు రు 36 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసిందని ఖమ్మం నగరంలోని చెరువు బజారుకు చెందిన పాలవెల్లి తులసి మరియు డౌలే సునీత పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ గారిని కలసి ఫిర్యాదు చేశారు.

 Tokara Arrests Husband And Wife-TeluguStop.com

పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు దాసరి సరితపై ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన సిఐ సమగ్ర విచారణ జరిపి సదరు దాసరి సరిత మరియు తన భర్త అయిన జన్నారం గ్రామం, ఏన్కూర్ మండలానికి చెందిన 2009 బ్యాచ్ కానిస్టేబుల్ ముద్దం శ్రీశాంత 26సం,, (ప్రస్తుత పోస్టింగ్ తల్లాడ P.S) అనునతనితో కలిసి సదరు దాసరి సరిత ‘రైల్వే డిపార్టుమెంట్ లో గేజిటేడ్ ఆఫీసర్ ఫేక్ ఐడి కార్డు తయారుచేసుకొని వారి బందువులకు, ఫ్రెండ్స్, మరియు ఇతరులకు రైల్వేలో వివిధ హోదాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మకం కలిగే విధంగా మాయమాటలు చెప్పి సుమారు 12 మంది బాధితుల వద్ద నుండి సుమారు 1, 88,95,000/- రూపాయలు వసూలు చేశారని, ఈవిధంగా మోసం చేసిన డబ్బుతో విలాసవంతమైన జీవనం గడుపుతూ., సొంత ప్రయోజనాలకు వాడుకుంటూ స్థిర, చరాస్థలు తినుగోలు చేశారని సిఐ తెలిపారు.ఇట్టి వాటిలో చాలా వరకు రికవరీ చేయడం జరిగిందని తెలిపారు.

నిందుతులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు.కానిస్టేబుల్ పై శాఖ పరమైన క్రమశిక్షణ చర్యలకు ప్రతిపాదన పంపనున్నట్లు సిఐ తెలిపారు.

పి ఆర్ వో

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube