28 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు

యాదాద్రి జిల్లా:జిల్లాలో రాబోయే హరితహారం కార్యక్రమంలో భాగంగా 28 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందని, వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యానికి తగినట్లుగా పూర్తి స్థాయిలో మొక్కలు నాటేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.మంగళవారం జిల్లా కేంద్రంలో మండల అభివృద్ధి అధికారులు,మండల పంచాయితీ అధికారులు,ఎపిఎంలు,పంచాయితీ రాజ్ ఇంజనీర్లతో హరితహారం కార్యక్రమంలో వివిధ శాఖలు మొక్కలు నాటే లక్ష్యాలను సమీక్షించారు.

 Plans To Plant 28 Lakh Seedlings-TeluguStop.com

ఉపాధిహామీ పనుల క్రింద 18 లక్షల మొక్కలు,జిల్లా అటవీ శాఖ వివిధ శాఖలు కలిపి 10 లక్షల మొక్కలతో మొత్తం 28 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని అధికారులు పూర్తి చేయాలని ఆదేశించారు.హరితహారం కార్యక్రమంలో గ్రామాల వారి ప్రణాళికతో నీటి పారుదల శాఖ కాలువల గట్లపై మొక్కల పెంపకం పెద్ద ఎత్తున చేపట్టాలని తెలిపారు.

బృహత్ పల్లెప్రకృతి వనాలలో పూర్తి స్థాయిలో మొక్కలు నాటాలని,వాటి ఏర్పాటుకు ప్రతి మండలానికి 5 స్థలాలను గుర్తించాలని,ఇప్పటికే జిల్లాలో 30 స్థలాలను గుర్తించడం జరిగిందని,వాటిలో 10 స్థలాలలో బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ సంవత్సరం చివరిలోగా స్థలాల ఏర్పాటుతో అన్ని బృహత్ పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

అలాగే రోడ్ల వెంట మూడు వరుసలలో పెద్ద మొక్కలు నాటాలని, ప్రభుత్వ కమ్యూనిటీ స్థలాలను గుర్తించి మొక్కలు నాటాలని,వాటి సంరక్షణ చేపట్టాలని తెలిపారు.అలాగే ఇంటింటికి 6 మొక్కలు అందచేయాలని, అందులో కృష్ణ తులసి వుండేలా చూడాలని తెలిపారు.

ఉపాధి హామీ క్రింద ఇప్పటి దాకా లక్షా 50 వేల మందికి పని కల్పించి 7 లక్షల 64 వేల పని దినాలు కల్పించడం జరిగిందని,వేతనాల క్రింద 11 కోట్ల 49 లక్షలు చెల్లించడం జరిగిందని తెలిపారు.ఉపాధి కూలీల శాతం పెంచాలని,అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించాలని,పని చేసే చోట వేసవి దృష్ట్యా మంచినీటి సౌకర్యం కల్పించాలని తెలిపారు.

తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం క్రింద ప్రతి గ్రామంలో ఎకరం కన్నా ఎక్కువ స్థలం సేకరించి క్రీడా ప్రాంగణానికి ఉపాధి హామీ పనుల క్రింద అభివృద్ధి చేయాలని తెలిపారు.ఈకార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ,జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మందడి ఉపేందర్రెడ్డి,జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వరరెడ్డి,జిల్లా పంచాయితీ అధికారి సునంద,అడిషనల్ డిఆర్డిఓ నాగిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube