ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 టోర్నీలో ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా వ్యవహారిస్తున్న రోహిత్ శర్మకు అనుకోని షాక్ తగిలిందనే చెప్పాలి.షాక్ అంటే అలాంటి ఇలాంటి షాక్ కాదండోయ్.
ఏకంగా 12 లక్షల జరిమానా కట్టే అంత షాక్ తగిలింది.అసలు వివరాల్లోకి వెళితే.
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో బౌలింగ్ కారణంగా ముంబై జట్టు ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది.స్లో ఓవర్ రేటు కారణంగా రోహిత్ శర్మకు రూ.12 లక్షల జరిమానా పడింది.ఈ మ్యాచ్‌లో మొదటగా ముంబై బ్యాటింగ్ దిగింది.
అయితే జట్టు 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.
ఆ తర్వాత నిర్దేశిత లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ 179/6తో విజయం సాధించింది.ముంబై జట్టుపై స్లో ఓవర్ రేట్ తప్పిదం కారణంగా రోహిత్‌కు రూ.12 లక్షల జరిమానా వేశారు.కాగా ఢిల్లీ టీమ్ గెలవాలంటే చివరి 24 బంతుల్లో 41 పరుగులు చేయాల్సి ఉండగా ఢిల్లీ ఆటగాళ్లు ఇన్నింగ్స్‌లో ఉండగా 17వ ఓవర్ వేసిన బసిల్ థంపీ 13 పరుగులు ఇచ్చాడు.ఇక 18వ ఓవర్‌లో 18 బంతుల్లో 28 పరుగులు చేయాల్సి ఉండగా డేనియల్ శామ్స్ బౌలింగ్ వేయగా మొదటి బాల్‌కే అక్షర్ పటేల్ సిక్స్ కొట్టేసాడు.
అంటే ఇప్పుడు లక్ష్యం 16 బంతుల్లో 21 పరుగులు చేయాలిసి ఉంది.

ముంబై గెలుస్తుంది అనే సమయానికి అందరి దృష్టి ఢిల్లీ వైపు మళ్ళింది.ఆ సమయంలో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలర్ అయిన డేనియల్ శామ్స్‌తో బంతి ఎలా వేయాలి ఏంటి అనే విషయంపై ఎక్కువ సమయం చర్చలకే పరిమితమయ్యాడు.ఓవర్ లో మిగిలిన 4 బంతులకీ రోహిత్ శర్మ ఏకంగా 6, 4, 1 ,6 పరుగులు ఇచ్చేశాడు.
ఇక చివరికి 12 బంతుల్లో 4 పరుగులు చేస్తే ఢిల్లీదే విజయం అప్పుడే అక్షర్ పటేల్ బౌండరి కొట్టడంతో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో ముంబై పై విజయం సాధించింది.మ్యాచ్ గెలుపు కోసం మిగిలిన బంతులను ఎలా వినియోగించుకోవాలి అనేదానిపై రోహిత్ కాన్సంట్రేషన్ చేసి సమయపాలన పాటించలేదు.అందుకే స్లో ఓవర్ రేటు తప్పిదం కారణం చేత క రోహిత్ శర్మకు రూ.12 లక్షల జరిమానా పడింది.