తెలుగు చిత్ర పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ మంచు మనోజ్ ఇద్దరూ కూడా భారీ బ్యాక్ గ్రౌండ్ లో సినీ పరిశ్రమకు హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారే అనే విషయం అందరికీ తెలిసిన విషయమే.ఇక ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాప్ హీరోగా కొనసాగుతుండగా మంచు మనోజ్ మాత్రం సరైన స్టార్ డమ్ సంపాదించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
అయితే ఇక ఇద్దరూ హీరోల మధ్య ఐదు రకాల పోలికలు ఉన్నాయి.ఇది దాదాపు ప్రేక్షకులకు తెలుసు.
కానీ ఎప్పుడూ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉండరు.ఇక ఆ పోలికలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1.జూనియర్ ఎన్టీఆర్ మంచు మనోజ్ పుట్టినరోజులు ఒకే రోజు కావడం గమనార్హం.
ఇద్దరు కూడా 1983 మే 20 వ తేదీన జన్మించారు.ఇక మనోజ్ కి ఎన్టీఆర్ కి మధ్య కేవలం కొన్ని గంటలు మాత్రమే వయసు తేడా ఉంది.ఇక వీరి బర్త్డే వచ్చిందంటే ఒకరికొకరు బర్తడే విషెస్ చెప్పుకోవడం చేస్తూ ఉంటారు.
2.ఇక బాలనటుడిగా ఇద్దరు ఎంట్రీ ఇచ్చింది కూడా రామారావు సినిమాల్లోనే కావడం గమనార్హం.జూనియర్ ఎన్టీఆర్ తాత ఎన్టీఆర్ నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తే మనోజ్ రామారావు నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమా తో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఇద్దరూ హీరోలుగా రాణించారు.

ఇంకా ఇద్దరు హీరోల తండ్రులు కూడా రాజ్యసభ ఎంపీలు కావడం గమనార్హం.ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మనోజ్ తండ్రి మోహన్ బాబు ఇద్దరు ఎంపీలు రాజ్యసభలో అడుగుపెట్టారు.అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులు అయ్యారు ఇద్దరూ.

ఇక ఇద్దరు భార్యల పేరు కూడా ప్రణతి కావడం గమనార్హం.ఎన్టీఆర్ భార్య పేరు లక్ష్మి ప్రణతి కాగా మంచు మనోజ్ భార్య ప్రణతి రెడ్డి. కాగా ప్రస్తుతం మంచు మనోజ్ తన భార్యతో విడాకులు తీసుకున్నారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ రెండో భార్య సంతానం కాగా.మంచు మనోజ్ మోహన్ బాబు రెండో భార్య సంతానం కావడం గమనార్హం.
హరికృష్ణ తన మొదటి భార్య బతికుండగానే రెండో పెళ్లి చేసుకోగా.మోహన్ బాబు మాత్రం మొదటి భార్య ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమె సోదరిని రెండవ వివాహం చేసుకున్నారు.