టిడ్కో ఇళ్ళను వెంటనే ప్రభుత్వం లబ్ధి దారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో లబ్ది దారులతో కలసి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిపిఎం నేతల ఆందోళనకు దిగారు.పేదలకు స్ధలాలిస్తామన్న ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని జగనన్న కాలనీల్లో పేదోడు నష్టపోయాడు అధికార పార్టీ నేతలు బాగుపడ్డారని ఈ సందర్బంగా సిపిఎం నేత సిహెచ్.
బాబూరావు విమర్శించారు కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిన ఇళ్ళును రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంలేదని.
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని వటనే పేదలకు కట్టిన ఇళ్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్నికల దాకా కాలయాపన చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుందని గత ప్రభుత్వం మూడేళ్లు కాలయాపన చేసిందని.పేదలకు అన్యాయం చేయాలని చూస్తె సహించేది లేదను ఆగ్రహం వ్యక్తం చేశారు.
తక్షణమే పేదలకు కట్టిన ఇళ్లు ఇవ్వాలన్నారు.