మంచు హీరో విష్ణు ఆఫీస్ లో హెయిర్ డ్రెసింగ్ కు సంబందించిన కొంత సామాగ్రి చోరీకి గురయ్యాయని తెలుస్తుంది.మంచు విష్ణు దగ్గర హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేస్తున్న నాగ శ్రీను నే వాటిని దొంగతనం చేశాడని డౌట్ పడుతున్నారు.
ఈ చోరీపై జూబ్లీ హిల్స్ పీ.ఎస్ లో కేసు పెట్టారు మంచు విష్ణు మేనేజర్.హెయిర్ డ్రెస్సింగ్ కు సంబందించిన దాదాపు 5 లక్షల సామాగ్రి చోరీకి గురైనట్టు తెలుస్తుంది.అయితే ఈ నెల 19వ తారీఖే ఇది జరిగినా ఇది బయటకు రానివ్వలేదు.
హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీనునే ఈ దొంగతనం చేశాడా లేదా అన్నది పోలీసుల విచారణలో తెలియనుంది.ఈమధ్య మంచు ఫ్యామిలీ మీద ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు.ఏపీ సీఎం ని చిరంజీవి అండ్ కో కలిసిన టైం లో మంచు విష్ణు కామెంట్ చేయడం తో ఫ్యాన్స్ అతన్ని ఆడుకున్నారు.ఇక తర్వాత మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమాపై కూడా విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి.
ఈ ట్రోల్స్ తట్టుకోలేక మంచు ఫ్యామిలీ లీగల్ యాక్షన్ కి సిద్ధమైన విషయం తెలిసిందే.లేటెస్ట్ గా మంచు విష్ణు ఆఫీస్ లో దొంగతనం జరిగిందని మళ్లీ వార్తల్లో నిలిచారు.